ఎస్సి,ఎస్టీ ల ఫిర్యాదులను త్వరలో పరిష్కారం చేస్తాం..రాష్ట్ర ఎస్సి కమిషన్ చెల్లమ్ ఆనంద్ ప్రకాష్

ఎస్సి, ఎస్టీ లు ఇచ్చిన ఫిర్యాదులను త్వరలో పరిష్కారం చేస్తామని, కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకుని వెళ్తానని రాష్ట్ర ఎస్. సి. కమిషన్ సభ్యులు చెల్లమ్ ఆనంద్ ప్రకాష్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఫారెస్ట్ అతిధి గృహంలో ఎస్సి/ఎస్టీ సంఘాల, సంస్థల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అర్జీదారులు ఫిర్యాదులను సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్. సి. కమిషన్ సభ్యులు చెల్లమ్ ఆనంద్ ప్రకాష్ మాట్లాడుతూ, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. పి.లక్ష్మీ తన ఇంటి స్థలం కబ్జా కి గురైందని, స్థలం సమస్య పరిష్కారం కోరుతూ దరఖాస్తు సమర్పించారు. గంజి కిరణ్మయి తనకు బైపిసి చదివానని, ప్రభుత్వం నిర్వహించిన పోటీపరిక్షాల్లో 210 ర్యాంక్ వొచ్చిందన్నారు. ద్వారకా తిరుమల లోని గురుకుల పాఠశాలలో సీటు ఇప్పించాలని విజప్తి చేశారు. ఆయా ఫిర్యాదులను పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

అంతకుముందు శ్రీనివాసపురం గ్రామంలో ఇటీవల జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన ముప్పిడి రాజు కుటుంబ సభ్యులను రాష్ట్ర ఎస్. సి. కమిషన్ సభ్యులు చెల్లమ్ ఆనంద్ ప్రకాష్ పరామర్శించి, తగిన మనో ధైర్యం ఇవ్వడం జరిగిందన్నారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగిందని, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇవ్వడమే కాకుండా, స్థానిక నాయకుల విజ్ఞప్తి మేరకు కమిషన్ ఆధ్వర్యంలో జ్యుడీషియల్ ఎంక్వయిరి రాజు కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంఘటన దురదృష్టకరం ఎస్సి కమిషన్ తరపున ఈ ఘటన ను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎమ్. రాజు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రకటించిన ఆర్ధిక సహాయం రూ.8,25,000 లలో ఇప్పటికే రూ.4,12,500 ఆర్ధిక సహాయం అందినదని రాజు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంకా రావలసి ఉన్న ఆర్ధిక సహాయం తో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రెండు ఎకరాలు భూమి, ఇంటి స్థలం, సామాజిక భద్రతా పింఛను ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తూ, దరఖాస్తు సమర్పించారు.

ఈ పర్యటన లో తహసీల్దార్ ఆర్వీ మురళీకృష్ణ, డిఎస్పీ బి.రవికిరణ్, ఎస్సి నాయకులు డా. ఏ. ఆనంద్ శేఖర్, అంజి, ప్రసాద్, సి హెచ్ సంజీవ్, ఎమ్.అజయ్, జి. విజయ్ భాస్కర్, రవిప్రకాష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *