రాపూరు కి రింగు రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోండి..ఆర్డీఓకి వేణుగోపాల్ రెడ్డి వినతి

బండి వేణుగోపాల్ రెడ్డి చొరవతో మారనున్న రాపూరు రూపురేఖలు

రాపూరు: రాపూరు పట్టణంలో ఇరుకు రోడ్లు వల్ల ట్రాఫిక్,కు వ్యాపారస్తులు ఇబ్బందులకు గురవుతున్నారని ఎవరికి ఇబ్బందులు లేకుండా రాపూరు,బొజ్జనపల్లి,సిద్దవరం, పంచాయతీలు కలుపుతూ రాపూరు పట్టణం మీదుగా రింగు రోడ్డు ఏర్పాటు చేస్తే గ్రామాల్లోని ప్రజలకు రాపూరు పట్టణ ప్రజలకు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా ఉంటుందని రింగు రోడ్డు ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని నెల్లూరు ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ కి బండి వేణుగోపాల్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన ఆయన ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి రింగు రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని బండి వేణుగోపాల్ రెడ్డి కి హామీ ఇచ్చారు. నెల్లూరు ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ కి బండి వేణుగోపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *