హైస్కూల్ఎలిమెంటరీ పాఠశాల స్వీపర్స్ కు జీతాలు వెంటనే విడుదల చేయాలి..జువ్వల రాంబాబు డిమాండ్

1 min read

హైస్కూల్ఎలిమెంటరీ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్స్ కు జీతాలు వెంటనే ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పట్టణ ప్రజలసంక్షేమసంఘం నాయకులు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. స్కూల్ స్వీపర్స్.విజ్ఞప్తి మేరకు పట్టణంలో ఉన్న పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్స్ కి గత6నెలల నుండి జీతాలు రాకచాలా ఇబ్బందులు పడుతున్న ట్లు తెలిపారుస్వీపర్స్ జీతాలు కోసం ప్రభుత్వం ఆదేశాలు మేరకుప్రతిపాఠశాల లో విద్యార్థులనుండి500నుండి1000రూ, వరకు వసూలు చేసి బ్యాంకుల్లో జమచేశారు. అంతే కాకుండా అమ్మ ఒడి నుండి1000రూ మినహాంచింది. విద్యార్థుల సంఖ్య ను బట్టి5000రూ నుండి6000వేలు రూ!స్వీపర్స్ కి.జీతాలు ఇవ్వాలని. మెమో ప్రభుత్వం జారిచేసిందని కానీ ప్రభుత్వం. విద్యార్థులనుండి వసూలు చేసిన మొత్తాన్నిస్కూల్స్ నుండి. ప్రభుత్వం. RTGS ద్వారా.Dtmf(డిస్ట్రిక్ట్.టాయిలెట్స్ మానిటరీ ఫండ్)ఏలూరుకి జమచేశారు. డబ్బు అంత ప్రభుత్వం దగ్గర పెట్టుకొని. స్వీపర్స్ కి.1000రూ!మాత్రమే చెల్లించాలని మరో మెమో విడుదల చెయ్యటం చాలా అన్యాయం. అమానవియం. ఆడపిల్లలు చదివే పాటశాలల్లో మలమూత్రాలు శుభ్రం చేస్తూ ఎనలేని సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు6నెలల నుండిజీతాలు చెల్లించకపోగా. నెలకు వెయ్యిరూ!ఇవ్వాలని ఆదేశాలు జారీచెయ్యటం దారుణమని రాంబాబు విమర్శించారు పిల్లలు ఇచ్చిన డోనేషన్స్ ప్రభుత్వం దగ్గర ఉంచుకోవడం అన్యాయం అని రాంబాబు విమర్శించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *