“కాకాణి చేతులు మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం”

నెల్లూరు: పొదలకూరు మండలం, మరుపూరు గ్రామపంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.మరుపూరు గ్రామానికి 1 కోటి 10 లక్షల రూపాయలతో నిర్మించిన లింకు రోడ్డును, నూతన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతోపాటు, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం.ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నూటికి నూరు శాతం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. అధికార పార్టీ శాసనసభ్యునిగా 2ఏళ్ల పదవీ కాలంలో పొదలకూరు మండల అభివృద్ధి కోసం 127 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించాం. మరుపూరు గ్రామానికి సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు, తాగునీరు, సాగునీరు లాంటి వసతుల కల్పనకు 5కోట్ల 60లక్షల రూపాయలు మంజూరు చేయించానన్నారు. మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి పుణ్యాన కండలేరు ఎడమ కాలువ నిర్మాణంతో ఈ ప్రాంత రైతాంగం పంటలు పండించుకుంటున్నాం. నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా, రామనారాయణ రెడ్డి మంత్రిగా మరుపూరు గ్రామానికి కాలువ త్రవ్వించి, చెరువులకు నీరు అందించాం. తెలుగుదేశం హయాంలో కాసుల కోసం కక్కుర్తి పడి, కండలేరు ఎడమ కాలువ ఎత్తిపోతలకు నాసిరకం మోటార్లు బిగించి, రైతులకు అన్యాయం చేశారు. తెలుగుదేశం పార్టీ ఉనికిని చాటుకునేందుకు రైతు కోసం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. రైతు కోసం – తెలుగుదేశం కార్యక్రమాన్ని చూసి రైతులు ఛీత్కరించుకుంటున్నారు తప్ప, మద్దతు ఇవ్వడం లేదు.నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు పూర్తిస్థాయి వసతి సదుపాయాలు కల్పిస్తాం. గ్రామాలలోని పెద్దల సూచనలు, సలహాలు తీసుకొని, సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *