కస్తూరిభా కళాశాలల సిబ్బంది సమస్యలను కేంద్ర,రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకువెళతాను

బిజెపి అధికార ప్రతినిధి, ఎం.పి జి.వి.ఎల్.నరసింహారావు

శ్రీకాకుళం: రాష్ర్టంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కస్తూరిభా ప్రభుత్వ జూనియర్ కళాశాలల సిబ్బంది సమస్యలను కేంద్ర, రాష్ర్ట విద్యా శాఖా మంత్రుల దృష్టికి తీసుకువెళతానని బిజెపి అధికార ప్రతినిధి, ఎం.పి జి.వి.ఎల్.నరసింహారావు తెలిపారు. బిజెపి నిర్వహించిన ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక సదస్సులో పాల్గొనటానికి నగరానికి వచ్చిన జివిఎల్ ను, ఎం.ఎల్.సి మాధవ్ ను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన కస్తూరిభా జూనియర్ కళాశాలల అధ్యాపకులు కలసి తమ సమస్యలను పరిష్కరించాలని ఇరువురి నేతలకు వినతి పత్రాలు అందించారు. ఎం.ఎ. బి.ఇ.డిలు, ఎం.ఎస్.సి బి.ఇ.డిలు చేసి జూనియర్ లెక్చరర్లుగా పనిచేస్తున్న తమకు నెలకు 12000 వేల రూపాయిల గౌరవ వేతనం మాత్రం చెల్లిస్తున్నారని తెలిపారు. అలాగే తాము ఉద్యోగం చేరిన తొలి రోజున తమ విధులు పార్టు టైంగా ఉంటాయని చెప్పి ఇప్పుడు విధులు పూర్తిస్థాయిలో విధులు నిర్వహించాలని అనధికార ఉత్తర్వుల్లో పేర్కొన్నారు, ఎస్.ఎస్.ఎ అధికారులు పని విషయానికి వచ్చే సరికి ఇరవై నాలుగు గంటలు కళాశాలకు అంకితం కావాలని ఎస్.ఒ.లు తమపై పని ఒత్తిడి పెంచారని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యార్హతలు కలిగిన తామకు దిగువ స్థాయి సిబ్బందిలో సగం జీతం కూడా అందటం లేదని వాపోయారు. తమతో పాటే విధుల్లో చేరిన తెలంగాణాలోని కస్తూరిభా కళాశాల అధ్యాపకులకు 23 వేల రూపాయిలు జీతం అందుకుంటున్నారని జివిఎల్ దృష్టికి తెచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు 37,100, ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు 47,000 రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తున్నట్లు తెలిపారు, ఒకే పని ఒకే విధంగా చేస్తున్నప్పటికీ కలలో తేడా చూపించడం చాలా బాధాకరం అని ఈ సందర్భంగా తెలియజేశారు, తమకు కూడా ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల అర్హతలు కేజీబీవీ లో పనిచేస్తున్న అధ్యాపకులకు ఒకే విద్యార్హతలు తమ కూడా ఉన్నాయని తెలియజేశారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన కేజీబీవీ ఇంటర్మీడిట్ కళాశాలలో నేటికీ సైన్స్ ల్యాబ్ లో లేవని తెలిపారు, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్ .జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్ర శిక్ష లో పని చేస్తున్నా అన్ని విభాగాల ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి పనికి తగ్గ వేతనం చెల్లిస్తానని తెలిపారు, తక్షణమే సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగస్తులకు పీ .ఏ .బి ,ప్రకారము నూతన వేతనాలు చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు, అదేవిధంగా కేజీబీవీ ఇంటర్మీడియట్ కళాశాలలో వార్డెన్లు , ట్యూటర్ లు నియామకాలు జరగాలని ఈ సందర్భంగా తెలియజేశారు,జి.వి.ఎల్.నరసింహారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేజీబీవీ లో పనిచేస్తున్న అసలు అధ్యాపకుల సమస్యలను తాను కేంద్ర, రాష్ర్ట విద్యా శాఖా మంత్రుల దృష్టికి తెస్తానని, సమస్య పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకుంటానని జి.వి.ఎల్ .హామీ ఇచ్చారు. చివరగా ఈ కార్యక్రమము భాగంగా ఎం.ఎల్.సి మాధవ్ ని, ఎం.పి జి.వి.ఎల్ .నరసింహారావుని కస్తూరిభా ఇంటర్మీడియట్ కళాశాల మహిళ అధ్యాపకులు సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *