ఆరేళ్ల చిన్నారి దారుణ అఘాయిత్యం పై నటుడు మహేశ్ బాబు ఆవేదన

హైదరాబాదులో ఓ చిన్నారి అత్యాచారానికి గురై కన్నుమూసిన ఘటన పట్ల టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు చలించిపోయారు. సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దారుణ అఘాయిత్యం మనం ఓ సమాజంగా ఏ స్థాయికి దిగజారిపోయామో చెప్పేందుకు నిదర్శనం వంటిదని వ్యాఖ్యానించారు. “మన పిల్లలు ఎప్పటికైనా భద్రంగా ఉంటారా? అనేది ఓ జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. హృదయం భగ్గుమంటోంది… ఆ చిన్నారి కుటుంబం ఎంత క్షోభను అనుభవిస్తోందో ఊహించలేం” అని పేర్కొన్నారు. ఈ ఘటనపై సత్వరమే చర్యలు తీసుకుని ఆ చిన్నారికి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలి అని మహేశ్ బాబు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *