నిరుద్యోగ యువతకు జనసేన బాసటగా నిలిస్తే అరెస్టులు చేస్తారా?

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నెల్లూరు జిల్లా జనసేన ఇంఛార్జి చెన్నారెడ్డి మనుక్రాంత్ పిలుపుతో నిరుద్యోగులకు అండగా నూతన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని కోరుతూ ఈ రోజు నెల్లూరులోని ఎంప్లాయిమెంట్ ఎక్సచేంజ్ కార్యాలయంలో శాంతియుతంగా అధికారులకు వినతి పత్రం ఇవ్వాలని వెళుతున్న జనసేన యువజన విభాగ నాయకులు కిషోర్ గునుకుల ని,సిటీ నాయకులు సుజయ్ ని ,జనసేన కార్యకర్తలను అన్యాయంగా , అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారు.రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని వై ఎస్ జగన్ అధికారంలోకి వచ్చి నయవంచనకు పాల్పడితే,మోసపోయిన బాధితులకు జనసేన బాసటగా నిలిస్తే సీఎం ఇబ్బంది పెడుతున్నారు.ఇది అప్రజాస్వామికం..ప్రజాస్వామ్యంలో వినతిపత్రాలు ఇవ్వడం పౌరులకు, వారి పక్షాన నిలిచేవారికి ఉన్న హక్కు. దీన్ని అడ్డుకోవడం కచ్చితంగా నియంతృత్వ పోకడే అవుతుంది. సీఎం ఇచ్చిన హామీని గుర్తు చేసి అమలు చేయమంటే ఇబ్బంది కలుగుతోందా?ప్రభుత్వం ఎంతగా కట్టడి చేసినా జనసేన పార్టీ నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ అండగా నిలుస్తుంది.
ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని..అలా శాంతియుతంగా అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుంటే ఎలా అరెస్ట్ చేస్తారని..నెల్లూరు జిల్లా జనసేన ఇంచార్జి, రాష్ట్ర జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *