మోడల్ అద్దె చట్టం వల్ల ఎలాంటి లాభం కలగనుంది? ఎంపీ ఆదాల

కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన అద్దె చట్టం వల్ల ఎలాంటి లాభం చేకూరనుందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్ సభలో గురువారం ప్రశ్నించారు. దీనికి కేంద్ర గృహ నిర్మాణ, నగర కార్యకలాపాల శాఖ మంత్రి కౌశల్ కిషోర్ జవాబిస్తూ మోడల్ అద్దె చట్టం అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని తయారు చేశారని తెలిపారు. ఈ చట్టం గత ఏడాది జూలై 8 వ తేదీన అమలులోకి వచ్చిందని తెలిపారు. ఈ పథకం అమలు ప్రారంభ దశలో ఉందని పేర్కొన్నారు. అద్దెలకు సంబంధించి ఏర్పడిన వివాదాలను వేగవంతంగా పరిష్కరించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందని పేర్కొన్నారు. అద్దె కోర్టు, అద్దె ట్రిబ్యునల్ లతో కూడిన బలమైన ఫిర్యాదుల పరిష్కార విధానం అమలులోకి వచ్చిందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *