మాచారం నల్లమల చెంచులపై ఫారెస్ట్ అధికారుల దాడిని ఖండిస్తున్నాం..

1 min read

మాచారం నల్లమల చెంచులపై ఫారెస్ట్ అధికారుల దాడిని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది…

తెలంగాణ రాష్ట్రంలోని, అమ్రాబాద్ మండలం,నాగర్ కర్నూల్ జిల్లా, మాచారం గ్రామంలోని రెండు వందల సంవత్సరాలగా అటవీ భూముల్లో జీవిస్తున్న నల్లమల చెంచులపై ఫారెస్ట్ అధికారులు దాడి చేసి,కుట్రతో కేసులు నమోదు చేసి 4గురు చెంచులను మహబూబ్ నగర్ జైల్ కు తరలించడం పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాచారం గ్రామం లో చెంచు ప్రజలను కలిసి సేకరించిన నిజానిర్దారణ వివరాలు…. మూడు తరాలుగా తాత ముత్తాతల నుండి సుమారు80 ఎకరాల భూమిలో 23 కుటుంబాల చెంచులు వ్యయసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా అమ్రాబాద్ ఫారెస్ట్ అధికారులు వీళ్ళ భూములు ఫారెస్ట్ భూములని కాళీచేసి వెళ్ళిపొమ్మని ఒత్తిడి తెచ్చినారు. ఇటీవల ఆరునెలల క్రితం నుంచి,మీ భూములకు పట్టాలిస్తామని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్ హనుమంతు 23 చెంచు కుటుంబాల తో తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకొన్నాడు. దాన్ని ఆధారం చేసుకుని కేవలం రెండు సంవత్సరాలుగా ఈభూముల్లో ఉంటున్నారని కాళీచేసి వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చినారు.2 జులై,2021 శుక్రవారం నాడు,50 మంది ఫారెస్ట్ అధికారులు, చెంచుల భూముల్లో వ్యవసాయం చేయకుండా అడ్డుకొని, చెంచు లను దాడిచేసి, నానబూతులు తిట్టి, చెంచు ముండల్లారారా అడవులలో బతికే మీకెందుకే భూమంటూ దుర్భాశలాడినారు. మనస్తాపం చెందిన చెంచు మహిళలు తమపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసినారు.ఈ సందర్భంను సాకుగా తీసుకొని ఫారెస్ట్ అధికారులపైనే చెంచులు పెట్రొల్ పోసి దాడిచేసినారని అమ్రాబాద్ పోలీసుల ద్వారా తప్పుడు కేసు నమోదు చేయించి ఇద్దరు మహిళలను, ఇద్దరు పురుష చెంచులను మహబూబ్ నగర్ జిల్లా జైల్ కు కుట్రతో తరలించారు…..
1.చెంచులపై కుట్రతో దాడిచేసిన ఫారెస్ట్ అధికారుల పై SC/ST కేసు నమోదు చెయ్యాలి.
2.చెంచుల భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలి.
3.చెంచులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.
4.KCR ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిస్తామని అసెంబ్లీలో, ఎన్నికల ర్యాలీలలో ఎన్నో సందర్భంబాలుగా ఇచ్చిన హామీ మేరకు ఆదివాసులకు పొడుభూముల పట్టాలు మంజూరు చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది…..

పాల్గొన్నవారు..

1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్ధుడు,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2.N. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
3.మాదన కుమారస్వామి, సహాయకార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
4.అల్గోట్ రవిందర్, కోశాధికారి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
5.జెల్ల లింగయ్య, EC మెంబర్,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
6.వెంకటేష్,ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
7.జక్కబాలయ్య,సహాయ కార్యదర్శి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
8.తిరుమలయ్య,సహాయ కార్యదర్శి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
9.పోతే ప్రవీణ్, నిజామాబాద్ జిల్లా పౌర హక్కుల సంఘం.
మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పౌర హక్కుల సంఘం నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *