సీమ ప్రాజక్టులకు నీటి కేటాయింపులు జరపాలి

1 min read

విభజన చట్టం లోని సీమవాసుల హక్కులను కాపాడాలి.
ఆంధ్రప్రదేశ్ నీటి ప్రాజెక్టులు వనరులు- సవాళ్ళు.. పై ఈ రోజు 19 జూలై న విజయవాడ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
రాష్ట్రంలోని భారతీయ జనతాపార్టీ నాయకులు, ప్రజాసంఘాల వారు ఇందులో హాజరయ్యారు.రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి, వేమ అధ్యయన & అభివృద్ధి కేంద్రం అధ్యక్షులు డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి ఇందులో పాల్గోని ప్రస్తుత కృష్ణాజల వివాదాల నేపథ్యంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయమై మాట్లాడారు.ఈ కీలక సందర్భంలో భారతీయ జనతాపార్టీ క్రియాశీలకంగా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం లోని హంద్రీనీవా, గాలేరునగరి, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టు లకు నీటి కేటాయింపులు జరిపేలా చేయాలని కోరారు.బ్రిజేష్ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య తుది విచారణ జరుపుతున్న నేపథ్యంలో పై ప్రాజక్టులకు జలాలు కేటాయించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *