రోడ్డు ప్రమాదంలోపేటకు చెందిన ఇద్దరు దుర్మరణం..

1 min read

9 సంవత్సరాల పాప పరిస్థితి విషమం

16వ నెంబరు జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లా లోని ఒంగోలు-మేదరమెట్ల మధ్యలో మద్దిపాడు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిలకలూరిపేట పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా మరొక పాప తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి చిలకలూరిపేట పట్టణం లోని డైక్ మెన్ నగర్ కు చెందిన కొమరగిరి రాజేశ్వరి(19), కొమరగిరి ప్రసాద్ (17)లు అక్కా తమ్ముళ్ళు. మీరు బుధవారం ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. గురువారం వారు ద్విచక్ర వాహనంపై తిరిగి చిలకలూరిపేట వస్తున్నారు. వారితో పాటు వారి అన్నయ్య కుమార్తె ప్రశాంతి(9) కూడా ఉంది. జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం నిలిచి ఉన్న కంటైనర్ లారీని ఢీకొంది. రాజేశ్వరి, ప్రసాద్ లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పాప తీవ్రంగా గాయపడింది. పాపను ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు లలిత హాస్పిటల్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *