ఏపీలోని 3 చారిత్రక కట్టడాలకు ఆదర్శ స్మారకాలుగా గుర్తింపు: కిషన్ రెడ్డి

1 min read

ఏపీలోని చారిత్రక కట్టడాలకు కేంద్రం గుర్తింపు నాగార్జునకొండ, శాలిహుండం, లేపాక్షి ఆలయంలకు గుర్తింపు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న కిషన్ రెడ్డి వారసత్వ కట్టడాల దత్తత పథకంలో గండికోట ఏపీలోని పలు చారిత్రక నిర్మాణాలకు విశిష్ట గుర్తింపు లభించింది. రాష్ట్రంలోని 3 చారిత్రక కట్టడాలను ఆదర్శ స్మారకాలుగా గుర్తించినట్టు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. గుంటూరు జిల్లాలోని నాగార్జునకొండ, శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం, అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని ఆదర్శ స్మారకాల జాబితాలో చేర్చినట్టు తెలిపారు. ఈ ఆదర్శ స్మారకాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. వీటిలో వై-ఫై ఇంటర్నెట్ సౌకర్యం, ఎగ్జిబిషన్, లైటింగ్ ప్రదర్శనలు, కెఫే వంటి ఏర్పాట్లు చేస్తామని కిషన్ రెడ్డి వివరించారు. ఇక వారసత్వ కట్టడాల దత్తత పథకంలో కడప జిల్లా గండికోటకు స్థానం కల్పించినట్టు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *