కానిస్టేబుల్ కుటుంబానికి భద్రత చెక్కులు అందజేత

1 min read

డబ్బు వృథా చేసుకోకుండా కుటుంబ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచన

అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి భద్రత చెక్కులు అందజేశారు. వివరాలు…
అనంతపురం నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్లో పని చేస్తున్న 2013 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ ఉపేంద్ర ( పి.సి నంబర్ 179) ఈ ఏడాది మే 31 వ తేదీన అనారోగ్యంతో మృతి చెందారు. ఈనేపథ్యంలో భద్రత కింద మృతుడి భార్యకు రూ. 1,97,480/-… మృతుడి తండ్రి ముత్యాలప్పకు రూ. 2 లక్షల చెక్కులను జిల్లా ఎస్పీ ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ డబ్బును వృథా చేసుకోకుండా కుటుంబ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ఎస్పీ సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయం సూపరింటెండెంట్ రమేష్ , మృతుడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *