బీసీల సమస్యలపై ఉద్యమం ఉదృతం-బీసీఆర్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు సాకేనరేష్

అనంతపురం : బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి(బీసీఆర్పీస్) ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సాకేనరేష్ మాట్లాడుతూ ప్రభుత్వాలు, పాలకులు మారిన బీసీల తలరాతలు మారలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక, స్ఫూర్తి, మౌళిక లక్ష్యానికి వ్యతిరేకంగా పాలక ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు.60 శాతం జనాభా ఉన్న బీసీలకు రాజకీయ రంగంలో కేవలం 14 శాతం ఉద్యోగ రంగంలో 8 శాతం మాత్రమే ఉండటం విచారకరమన్నారు. దేశంలో 18 రాష్టాలలో ఒక్క ఎంపీ కూడా లేకపోవడం బీసీలకు పట్టిన దురదృష్టమని వాపోయారు. జాతీయ స్థాయిలో బీసీ కుల సంఘాల నాయకులను, ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ ఉద్యమం ఉదృతం చేస్తామన్నారు.వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకు 50 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు పెట్టాలని దీనికోసం ఎంపీలు గళం విప్పాలన్నారు. బీసీలకు సబ్ ప్లాన్, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, ప్రతి కులానికి ఆత్మగౌరవ భవన్, బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి కరోనాతో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బిసి సురేష్, కార్యదర్శి ప్రవీణ్ కుమార్, నగర కార్యదర్శి హరిక్రిష్ణ, ప్రచార కార్యదర్శి ప్రసాదు, ఉపాధ్యక్షుడు గోపాల్, సిద్ధు, మనోజ్, శ్రీకాంత్, నారాయణస్వామి, మురళి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *