త్వరలోనే శ్రీ కామాక్షి దేవి సమేత లింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం

పురాణ చరిత్ర కలిగిన కోట మండలంలోని కొక్కుపాడు పంచాయతీ పరిధిలో ఉన్న సూరిశెట్టి పాళెం లో వెలసిన యున్నశ్రీ కామాక్షి దేవి సమేత లింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానుంది అని ఆయన కమిటీ నిర్వహుకులు వరదలమేటి సుబ్రహ్మణ్యం శెట్టి, గంజి బాలయ్య శెట్టి, సూరిశెట్టి సురేష్ లు వెల్లడించారు.గురువారం సూరిశెట్టి పాళెం లోనిశ్రీ కామాక్షి దేవి సమేత లింగేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చరిత్ర కలిగినశ్రీ కామాక్షి దేవి సమేత లింగేశ్వర స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో అదే స్థానంలో నూతన ఆలయ నిర్మాణం చేపడుతున్నాం అనీ వారు తెలిపారు, ఆలయ నిర్మాణానికి దాతలు సాయం చేస్తున్న సమయంలో రాష్ట్ర దేవాదాయశాఖ నిబంధనలు ప్రకారం ముందుగా ఆలయ కమిటీ 13 లక్షల రూపాయాలు దేవాదాయశాఖ కు చెల్లించడం జరిగింది అని ఆ తరువాత దేవాదాయశాఖ 27 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడంతో పాటు డిపాజిట్ 13 లక్షల రూపాయల తో కలిపి మొత్తం 40 లక్షల రూపాయలు నిధులు విడుదల చేయడం జరుగుతుంది అని వారు తెలియజేశారు.ఈ నేపధ్యంలో నిధులు త్వరగా విడుదల చేయాలని గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావుల ను కలిసి వినతిపత్రం అందజేసి కోరడంతో వారు వెంటనే స్పందించి త్వరలోనే నిధులు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. నిధులు విడుదల అయిన వెంటనే ఆలయ నిర్మాణ పనులు మొదలు పెట్టి త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుంది అని వారు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *