కవితా చైతన్యదీప్తి ‘గుర్రం జాషువా’ – వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి

గుంటూరు: తెలుగు సాహితీ వనంలో పూసిన కవితా సుమం.. మూఢాచారాలపై తన కవిత్వంతో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన కవితా చైతన్య దీప్తి.. నవయుగ కవి చక్రవర్తి బిరుదాంకితులు గుర్రం జాషువా అని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు.శనివారం జాషువా 50వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఆధునిక కవుల్లో ప్రముఖస్థానం పొందిన గుర్రం జాషువాను జాతి మరువని విధంగా ప్రభుత్వం సముచిత స్థానంకల్పించిందన్నారు.గుంటూరులో జాషువా స్మారకస్థూప స్థాపనతో పాటు గుంటూరు నడ్డి బొడ్డున జాషువా కళాపీఠాన్ని 3 కోట్ల రూపాయల నిధుల తో రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేయటం హర్షణీయమన్నారు. సమకాలీన కవిత్వ ఒరవడి నుంచి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసిన సాహిత్య సృష్టికర్తగా జాషువా ఖ్యాతిగాంచినట్లు వెల్లడించారు. అదేవిధంగా కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని మూఢాచారాలపై జాషువా పోరు కొనసాగించారని…ఛీత్కారాలు ఎదుర్కొన్నచోటే సత్కారాలు పొందిన మహనీయుడన్నారు.దళితులు ఆవేదనలను, ఆక్రోశాలను తన రచనల ద్వారా లోకానికి తెలియచేసిన మహా కవి జాషువా అంటూ ఆయనకు లక్ష్మణరెడ్డి నివాళి అర్పించారు.జాషువా తన రచనల ద్వారా అణచివేతకు గురైన వారిలో ఉద్దీప్తమైన చైతన్యాన్ని కలిగించారని ఆయన అన్నారు. జాషువా లాంటి సాహితీవేత్తలను ప్రాంతాలకతీతంగా అందరు ప్రోత్సహించాలని లక్ష్మణరెడ్డి తెలిపారు.గుర్రం జాషువా మనోభావాలకు అనుగుణంగా సామజిక నాయ్యానికి ప్రాధాన్యత ఇస్తూ దళిత బలహీన మైనార్టీ వర్గాల లో ఆర్ధిక సమానత్వం పెంపొందించే బాటలో రాష్ట్ర ముఖ్యమంత్రి పయనిస్తూ ఉండటం
హర్షణీయమన్నారు. స్థానిక నగరంపాలెంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అధ్యక్షతన జాషువా కళాపీఠం ఆధ్వర్యాన దివంగత గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు.రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే జిల్లాలకు గుంటూరు లో పలనాడు జాషువా జిల్లాగా నామకరణం ఉండాలని కోరారు.రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్,శాసన మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి,కే.యస్.లక్ష్మణ రావు,కల్పలత రెడ్డి,ఎమ్మెల్యేలు షేక్ ముస్తాఫా,మద్దాళి గిరి,గుంటూరు నగర మేయర్ కావటి మనోహర నాయుడు,గుంటూరు జాయింట్ కలెక్టర్ ప్రశాంతి తో పాటు నగర కార్పొరేటర్స్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *