కొత్తపాలెంలో జవాన్ జశ్వంత్ రెడ్డి సంస్మరణ సభ

1 min read

బాపట్ల, గుంటూరు జిల్లా: బాపట్ల మండల దరివాడ కొత్తపాలెంలో జవాన్ జశ్వంత్ రెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్, మాజీ శాసన సభ్యులు చీరాల గోవర్ధన్ రెడ్డి ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జవాన్ జశ్వంత్ కుటుంబసభ్యులను వీరు పరామర్శించడం జరిగింది. జశ్వంత్ మృతికి సంతాపం తెలుపుతూ కాసేపు మౌనం పాటించారు.చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు విడిచిన జశ్వంత్ రెడ్డి స్థిరస్థాయిగా నిలిచిపోతారని హోంమంత్రి సుచరిత కొనియాడారు. డిప్యూటీ స్పీకర్ కొనా మాట్లాడుతూ తన 8సం మనవడు ఆర్మీ కి వెళ్తా అని అన్నట్లు చెప్తూ, అంతటి చిన్న పిల్లాడిని కూడా ఆలోచింపచేసింది మన జస్వంత్ వీర మరమరణం అన్నారు. కోనా మాటలకు అక్కడ ఉన్నా ప్రజలంతా హర్షధ్వానాలతో స్పందించడం విశేషం.వీర జవాన్ త్యాగాన్ని గుర్తు చేస్తూ, ఆ కుటుంబానికి తన వంతు చిరుసాయంగా రూ.50,000/- అందించిన మేకతోటి దయాసాగర్, కమీషనర్ అఫ్ ఇన్కమ్ టాక్స్ హైదరాబాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *