శాకాంబరి అలంకరణలో దేవతా మూర్తులు

ఒంగోలు: నగరంలోని కేశవస్వామి పేటలొ కొలువైన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానమున శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారు, శ్రీ ఆండాళ్ (గోదాదేవి) అమ్మవారు మరియు కాశీవిశ్వేశ్వరాలయమున దేవస్థానమున శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి శాకాంబరి అలంకరణ లొ భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ అర్చకులు మాట్లాడుచూ ఆషాఢమాసం శుక్రవారం నాడు అమ్మవారిని శాకాంబరిగ పూజించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ఈ కాలంలోనే వర్షాకాలం ప్రారంభమై చిరుజల్లులతో పుడమి పులకిస్తుందని, శాకాంబరిగ అమ్మవారిని పూజించడం వలన దేవతా మూర్తులు ప్రజలందరూ సుఖశాంతులతో, ఆరోగ్యంతో జీవించడానికి అనుగ్రహిస్తారని, పంటలు బాగుగా పండి దిగుబడి బాగా వస్తుందని తెలిపారు. శాకాంబరి అలంకరణ లోని అమ్మవార్లను దర్శించడం ప్రకృతిమాతను దర్శించడమేయని వివరించారు.దేవాలయ ఈవో, ధర్మకర్తల మండలి ఛైర్మన్ మరియు సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *