సంతనూతలపాడు సచివాలయంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ప్రకాశంజిల్లా సంతనూతలపాడులోని 1, 2 సచివాలయాలను శనివారం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ శనివారం ఆకస్మికముగా సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందిని నవరత్నాల పథకాలకు సంబంధించిన ప్రోగ్రెస్ గురించి అడిగి తెలుసుకున్నారు. వైస్సార్ భీమా నమోదు, కాపు నేస్తం వివరాలను వెల్ఫేర్ అసిస్టెంట్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే కోవిడ్ పాజిటివ్ కేసులకు సంబంధించి రెండవ కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేసిన నమోదు గురించి మహిళ పోలీసులను అడిగి తెలుసుకొని రికార్డులు పరిశీలించినారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సర్టిఫికేట్లు సేవలు అన్నీ సచివాలయం ద్వారానే జరగాలని ఎవ్వరూ కూడా మీసేవ వరకూ వెళ్లకూడదని డిజిటల్ అసిస్టెంట్ కి సూచించారు. అలాగే రెవెన్యూ రికార్డ్స్ గురించి గ్రామీణ సర్వేయర్లకు పలు సూచనలు జారీ చేశారు. అగ్రికల్చర్ అసిస్టెంట్, ఫిషెరీస్ అసిస్టెంట్లు సక్రమంగా తమ విధి నిర్వహణ బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. పంచాయితీ కార్యదర్శులు ఇంటి పనులు వసూలు నూరు శాతం జరిగేలా చేపట్టాలని అన్నారు. రికార్డులు నమోదు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. సచివాలయం రికార్డులు అన్నీ పరిశీలించి తగు సూచనలు సలహాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల్లో అర్హత ఉన్న లబ్ధిదారుల పేర్లను నోటీసు బోర్డులో పెట్టాలన్నారు. వైద్య అధికారులు ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా ప్రజలకు వాక్సినేషన్లు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడిఓ ఎస్వీ ప్రసాద్, ఈవోఆర్డీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *