జర్నలిజంలో డిప్లొమా కోర్సు..

ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథరెడ్డి వెల్లడి..

నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ద్వారా జర్నలిజంలో డిప్లొమా సర్టిఫికెట్‌ కోర్సు అందించనున్నట్లు రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథరెడ్డి వెల్లడించారు. విజయవాడలోని ప్రెస్‌ అకాడమీ కార్యాలయంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ కృష్ణారెడ్డితో కలిసి కోర్సుకు సంబంధించిన బ్రోచర్‌ను బుధవారం విడుదల చేశారు. అనంతరం శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ ‘కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తాం. స్టడీ మెటీరియల్‌కు సరఫరా చేస్తాం. వర్కింగ్‌ జర్నలిస్టులకు రూ.1500, జర్నలిజంపై ఆసక్తి ఉన్న డిగ్రీ పూర్తి చేసి వారికి రూ.3 వేల ఫీజు నిర్ణయించాం’ అని తెలిపారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ నేడు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని, ఆగస్టు 20లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *