టేకుమట్ల వైన్ షాప్ యాజమాన్యంపై ప్రొబేషనరీ ఎస్సై కి ఫిర్యాదు

1 min read

బెల్ట్ షాపులు అరికట్టాలని ప్రొబేషనరీ ఎస్సై కి ఫిర్యాదు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కేంద్రంలొ గల వైన్ షాప్ యజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, ఎం ఆర్ పి రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తూ, సమయపాలన పాటించకుండా, గ్రామాలల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాప్ లు నిర్వహిస్తున్నారని, బెల్ట్ షాపులు అరికట్టాలని ఎం ఆర్ పి ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు (టిఎస్) ఎలుకటి రాజయ్య మాదిగ, సిపిఐ (యంయల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారెపెల్లి మల్లేష్ ప్రొబేషనరీ ఎస్సై కి ఫిర్యాదుచేశారు.అనంతరం వారు మాట్లాడుతూ టేకుమట్ల మండలం లోని ప్రతీ గ్రామంలో బెల్టు షాపులు వల్ల ప్రజలు మద్యం ప్రీయులు అదిక రేట్లు పెట్టి నష్టపోతున్నారన్నారు.గతంలో ఈ మద్యం షాపు యాజమాన్యాలు నకిలీ మద్యం విక్రయిస్తున్నట్లు కూడా తెలిసిందన్నారు.కరోనా సమయంలో షాపులు బంద్ చెయగా ఇదే షాపు నిర్వాహకులు గ్రామాల్లో డబుల్ రేట్లకు విక్రయించి ఇచ్చారని ఆరోపించారు.ఎక్సైజ్ శాఖ అధికారులకు ముడుపులు ముట్టడం వల్లనే ఈ షాపు నుండి అక్రమ మద్యం సరఫరా అవుతున్న పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.గతంలో ఈ షాపు పై అనేక ఆరోపణలు వచ్చినా గానీ జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.త్వరలో ఈ వైన్ షాపుపై చర్యలు అదికారులు తీసుకోవడం లేదని కోర్టును ఆశ్రయిస్తామన్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు వైన్ షాప్ తెరవాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు వైన్ షాప్ తీస్తున్నారని. సాయంత్రం ఆరు గంటలకే షాప్ బంద్ చేయడం వల్ల మద్యం ప్రియులు గత్యంతరం లేక బెల్ట్ షాపుల్లో అదనంగా డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా షాప్ లో రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి రెండవ కౌంటర్ ద్వారా బెల్ట్ షాపులకి మద్యం ఆటోల ద్వారా సరఫరా చేస్తున్నారని అన్నారు. ఎం ఆర్ పి రేట్ల కంటే అధికంగా క్వార్టర్ కు పది రూపాయలు, ఫుల్ బాటిల్ కు ఎనభై రూపాయల వరకు వసూలు చేస్తూ అక్రమంగా దోచుకుంటున్నారని అన్నారు. వైన్ షాప్ చుట్టూ నాలుగు బెల్టుషాపులు ఏర్పాటుచేసి ఈ బెల్టు షాపుల ద్వారా మధ్యo అమ్మిస్తూ మద్యం ప్రియుల జేబులు కొల్లగొడుతున్నారని తెలిపారు. ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలసి మద్యం ఏరులై పారుతున్నదని. దాంతో గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయని,ఇంత తతంగం జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు, పోలీస్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి వైన్ షాప్ లైసెన్స్ రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి మండల అధ్యక్షులు అంబాల రమేష్, నాయకులు మహిపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *