సీఎం అనాలోచిత నిర్ణయాలు.. ప్రమాదంలో జిల్లాల భవిష్యత్..మాజీ మంత్రి సోమిరెడ్డి

1 min read

సీఎం జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో ప్రమాదంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల భవిష్యత్…

ఏం తెలుసని, ఏం అవగాహన ఉందని కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ను సజ్జల స్వాగతిస్తారు..

ఇది ఆషామాషీ వ్యవహారం కాదు..ఆరు జిల్లాల వాసులం రాజకీయాలకు అతీతంగా ఏకమవుతాం..తాడోపేడో తేల్చుకుంటాం..

ఇప్పటికైనా మించిపోయింది లేదు జగన్మోహన్ రెడ్డీ….మీ కంటే వయస్సులో పెద్దవారైన కేసీఆర్ దగ్గరకు వెళ్లి కూర్చుని సమస్యను సామరస్యంగా పరిష్కరించండి..

కాంట్రాక్టులు, అడ్వాన్సుల కోసమే కాకుండా వెంటనే ఆయకట్టు వచ్చే ప్రాజెక్టులను కూడా పూర్తి చేయండి..

పోలవరం, పట్టిసీమ, చింతలపూడి ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు 70 టీఎంసీలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో దామాషా ప్రకారం ఆ మేరకు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు శ్రీశైలం నుంచి నికరజలాలు కేటాయింపునకు ఉత్తర్వులు ఇవ్వండి..

కర్నూలులో మీడియాతో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి…

కృష్ణాజలాలపై కేంద్రం పెత్తనం తీసుకున్న నేపథ్యంలో రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తుపై కర్నూలులో తెలుగుదేశం పార్టీ నేతల సమావేశం..

రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు వచ్చే ఇబ్బందులపై సమాలోచన..

సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నూతనకాల్వ అమర్నాథ్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, కేఈ ప్రభాకర్, పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాసులురెడ్డి, బీకే పార్థసారధి, బీసీ జనార్దన్ రెడ్డి, గౌరు చరితారెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు

సోమిరెడ్డి కామెంట్స్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం, ఒంటెత్తు పోకడలు, అనాలోచిత నిర్ణయాలతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల భవిష్యత్ ప్రమాదంలో పడింది..

800 అడుగుల్లో లిఫ్ట్ తెస్తామన్నారు..తీసుకురండి..అందరం సంతోషిస్తాం..

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని 40 వేల నుంచి 80 వేలకు పెంచుతామన్నారు..పెంచండి..ఆనందిస్తాం..

మీ ఘన కార్యాలేంటో సాధించండి…అంతే కానీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఆపి కాదని గుర్తుంచుకోండి..

800 అడుగుల నుంచి నీటిని తెచ్చే అంశాన్ని ఇంత వివాదాస్పదం ఎందుకు చేస్తున్నారు…

జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల కారణంగానే రాష్ట్రంలోని 107 ప్రాజెక్టులపై పెత్తనం ఈ రోజు కేంద్రం తీసుకుంది…

ఎన్జీటీ, క్రిష్ణా బోర్డుకు సంబంధం లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టగలరా..వారిని అనుమతించండి…వారిచ్చే రిపోర్టుపై పోరాడండి..

తెలంగాణలో అనుమతి లేకుండా జరుగుతున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతలపై పోరాటం చేయండి..

కేసీఆర్ లాంటి ఉదాత్తమైన మహనీయుడు లేడని నిండు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కీర్తించారు..

తెలంగాణ భూభాగం మీదుగా గోదావరి జలాలు తీసుకొస్తామన్నారు..ఈ రోజు మీ ఇద్దరి స్నేహం ఏమైంది..

నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో విలువైన జలాలను సముద్రానికి వదిలేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలిగారు.

కేసీఆర్ ఒక రోజు శ్రీశైలం ప్రాజెక్టు కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసమే అని మాట్లాడారు..నీళ్లు చెరి సగం అన్నారు..ఆ రోజు మీరేం చేస్తున్నారు..

కర్నూలు జిల్లాకు చెందిన 80 వేల కుటుంబాల త్యాగంతో వచ్చిన శ్రీశైలం ప్రాజెక్టులో మనకు హక్కులే లేవనే పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది..

అనంతపురంలోని కరువు పరిస్థితులు, ప్రజల బాధ గురించి సంపూర్ణంగా తెలిసిన కేసీఆర్ వద్ద కూర్చుని మాట్లాడుకోలేరా..

సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోలేక కేంద్రానికి లేఖలు రాసి నెత్తిమీదకు తీసుకొచ్చారు..

నోటిఫికేషన్ లో ఘోరమైన అంశాలు ఉంటే మీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి ఏం తెలుసని దానిని స్వాగతిస్తారు..

రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజల భవిష్యత్తును దెబ్బతీసే నోటిఫికేషన్ ను ఆయన ఎలా ఆమోదిస్తారు..

చీఫ్ ఇంజనీర్లు ఆ నోటిఫికేషన్ ను ఎలా స్వాగతిస్తారు…రాయలసీమలోని సాధారణ పౌరుడు అడిగే ప్రశ్నలకు అయినా మీరు సమాధానం చెప్పగలరా..

ఈ రోజు కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం శ్రీశైలం 885 అడుగులతో నిండిపోయి, సాగర్ పొర్లిపోయి వృథాగా సముద్రానికి పోయే పరిస్థితుల్లోనే రాయలసీమ, నెల్లూరుకు నీళ్లు వదిలే పరిస్థితి వచ్చింది..

ఇలా ఏకంగా ఒక ప్రాంతాన్నే తాకట్టు పెట్టేస్తారా..ఇంత బాధ్యత లేకుండా అధికారులు వ్యవహరిస్తారా..

ఇది ఆషామాషీ వ్యవహారం కాదు..ఆరు జిల్లాల వాసులం రాజకీయాలకు అతీతంగా ఏకమవుతాం..తాడోపేడో తేల్చుకుంటాం..

ఇప్పటికైనా మించిపోయింది లేదు..వయస్సులో మీకంటే పెద్దవారైనా కేసీఆర్ దగ్గరకు వెళ్లి కూర్చుని ఒక ప్రయత్నం చేయండి..సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోండి..

ఈ రోజు రాయలసీమలో తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు-నగిరి తదితర అనేక ప్రాజెక్టులు వచ్చాయంటే మహానుభావుడు ఎన్టీఆర్ పుణ్యమే..

రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్ లో ఇబ్బందులున్నా చంద్రబాబు నాయుడు సీఎంగా ఐదేళ్లలో 65 వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టారు..

మచ్చుమర్రి ప్రాజెక్టులో ఆరు పంపుల ద్వారా నీళ్లు విడుదల చేశాం..మీరొచ్చి ఎన్ని పంపులు అందుబాటులోకి తెచ్చారు..

జగన్మోహన్ రెడ్డీ..కాంట్రాక్టులు, అడ్వాన్సుల కోసమే కాకుండా వెంటనే ఆయకట్టు వచ్చే ప్రాజెక్టులను కూడా పూర్తి చేయండి..

తెలంగాణ ప్రతినిధులు బేసిన్ కూడా తమదని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా స్పందించరా…

ఈ ప్రాంతానికి నష్టం కలిగించే అంశాలను నోటిఫికేషన్ లో ఉపసంహరించుకునేందుకు సీఎంగా పోరాటం చేపట్టండి..

లేదంటే మేమంతా రాజకీయాలకు అతీతంగా పోరాటం చేపడతాం..

పోలవరం, పట్టిసీమ ద్వారా 45 టీఎంసీలు, చింతలపూడి ద్వారా 25 టీఎంసీల గోదావరి జలాలు కృష్ణా డెల్టాలో వాడుకునే అవకాశం వచ్చింది..

ఆ 70 టీఎంసీల జలాలను శ్రీశైలం నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు నికర జలాలుగా వాడుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలి..

చంద్రబాబు నాయుడు చేపట్టిన గోదావరి-పెన్నానది అనుసంధానం కార్యరూపం దాల్చి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కు గోదావరి జలాలు చేరితే నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో చాలా వరకు నీటి సమస్య పరిష్కారమవుతుంది…

అక్కడ మిగిలే జలాలను రాయలసీమలో వాడుకోవచ్చు..ఆ ప్రాజెక్టుపై దృష్టి పెట్టండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *