గంగపుత్రులకు అన్ని విధాల సహకారం: ఎమ్మెల్యే

ఆదిలాబాద్ రూరల్: మండలంలోని చాంద (టి) గ్రామ మత్స్య సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు. సంఘం నూతన అధ్యక్షులుగా కాస్తే గంగారాం, ఉపాధ్యక్షులుగా భావునే తా జి, కార్యదర్శిగా జింగారే దత్తు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న ను బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతన సభ్యులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గంగపుత్రులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు. ఈ కార్య క్రమంలో చాంద (టి) గ్రామ పంచాయతీ సర్పంచ్ దారట్ల భాస్కర్, ఉప సర్పంచ్ సుదర్శన్, టిఆర్ఎస్ నాయకులు అరె నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *