డి-అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించిన మద్య విమోచన ప్రచార కమిటీ బృందం

1 min read

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తో పాటు వారి బృందం రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు పి.రామచంద్ర రాజు, జన చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ప్రొఫెసర్ జి. విజయసారథి,మానవతా కో-కన్వీనర్ సలీం మాలిక్, వైఎస్ఆర్ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు జి. శాంతమూర్తి, ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్ లతో కూడిన బృందం ఈ నెల 6వ తేదీన గుంటూరు లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో గల డి అడిక్షన్ కేంద్రాన్ని,మధురాన్నం భోజనశాలను సందర్శించారు. గత సంవత్సర కాలంగా దాదాపు 800 మంది మద్యం వ్యసనపరులను గుంటూరులోని డి అడిక్షన్ కేంద్రంలో చికిత్స అందించారని లక్ష్మణరెడ్డి తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి రాష్ట్రంలోని జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులలో పదిహేను డి అడిక్షన్ కేంద్రాలను స్థాపించి తగిన వైద్య సిబ్బందిని, వనరులను ఏర్పాటుచేశారన్నారు. గత ప్రభుత్వాలు ఒకటి లేదా రెండు డి అడిక్షన్ కేంద్రాలను కూడా ప్రారంభించకుండా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒకేసారి 15 డి అడిక్షన్ కేంద్రాలను ఏర్పరచడం అభిలషణీయమని,వీటిని ఆంధ్రప్రదేశ్ లోని మద్యం వ్యసనపరులందరూ వినియోగించుకుని వ్యసనాల నుండి విముక్తి పొందాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు కోటి మంది పొదుపు మహిళలు, నాలుగు లక్షలకు పైగా ఉన్న వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వారి దృష్టికి వచ్చిన వ్యసనపరులు లను గుర్తించి డి -అడిక్షన్ కేంద్రాలకు పంపి ఆధునికమైన ఉచిత వైద్యాన్ని అందించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు.అనంతరం మధురాన్నం భోజనశాలను సందర్శించి ఆధునిక పద్ధతులలో పుష్టికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించటాన్ని పరిశీలించారు. గుంటూరు జిల్లా ఇన్చార్జి, గృహ నిర్మాణ శాఖ మాత్యులు శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు వ్యక్తిగతంగా ఒక కోటి రూపాయలను విరాళంగా ఇవ్వటాన్ని రాజకీయ పార్టీ నేతలందరూ స్వాగతించాలని కూడా వారి వారి ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలలో ఉచిత భోజన సదుపాయం కల్పించాలని కోరారు. గుంటూరు జిల్లా జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ ప్రభావతి రోగుల పట్ల ప్రేమతో వారికి మంచి సేవలను అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డి అడిక్షన్ కేంద్రం విభాగ అధిపతి డాక్టర్ లోకేష్ రెడ్డి,ఎస్ వి ఎస్ లక్ష్మీనారాయణ, డా”జానీ, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రఫీ, ఎక్సైజ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *