జీవితాంతం జగన్ మోహన్ రెడ్డికి బాసటగా ఉంటాను..లేళ్ళ అప్పిరెడ్డి

గుంటూరు: నా రాజకీయ జీవితంలో ప్రతి అడుగులో నాకు అండగా ఉండి నన్ను నేడు ఈ స్థాయికి చేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి నా జీవితాంతం బాసటగా ఉంటాను అని ఈ నెల 19వ తేదీన జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో మద్య విమోచన ప్రచార కమిటీ కార్యాలయ హాలులో జరిగిన అభినందన సభలో లేళ్ళ అప్పిరెడ్డి పేర్కొన్నారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి ప్రసంగిస్తూ నా రాజకీయ జీవితంలో ప్రధాన ఘట్టాలైన మార్కెట్ యార్డ్ చైర్మన్ నియామకం,2014లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం, నేడు గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యునిగా నియమించడంలో ప్రధాన భూమి క వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి జీవితాంతం రుణపడి ఉంటాను అని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు.గుంటూరు నగర అభివృద్ధికి, వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్రంలో నిర్మాణ పరంగా బలోపేతం కావడానికి అవిరళ కృషి చేస్తానని తెలిపారు.తన అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు.జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ వారసత్వం,కులం,అర్ధ బలాలు ఏమీ లేకుండా సామాన్య రైతు కుటుంబంలో జన్మించి స్వయంకృషితో లేళ్ల అప్పిరెడ్డి ఎదగడాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ప్రజా సమస్యలను నిరంతరం అధ్యయనం చేస్తూ వాటి పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేయడం ద్వారానే ప్రజానాయకుడిగా లేళ్ళ అప్పిరెడ్డి ఎదిగారని అన్నారు. మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ లేళ్ళ అప్పి రెడ్డి రాజకీయ ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఓర్పుతో,సహనంతో రాజకీయ జీవితాన్ని కొనసాగించారని తెలిపారు.30 సంవత్సరాల రాజకీయ గమనంలో విద్యార్థి,యువజన,కార్మిక నాయకుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగారని అభినందించారు. శాసనమండలి సభ్యులు కె.ఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ లేళ్ళ అప్పిరెడ్డి తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ స్ఫూర్తి పౌండేషన్ ద్వారా బహుముఖ కార్యక్రమాలు చేపట్టారని,కార్మిక నేత గా జూట్ మిల్లు కార్మికుల ఆవేదనలను అర్థం చేసుకొని వారి కోసం శ్రమించారని తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ప్రసంగిస్తూ తాను విద్యార్ధి దశలో ఉన్నప్పుడే లేళ్ళ అప్పిరెడ్డి రాజకీయ నేతగా ఎదిగారని వారి నుండి యువత స్ఫూర్తిని పొందాలన్నారు.గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ప్రసంగిస్తూ లేళ్ళ అప్పి రెడ్డి తోడ్పాటుతో గుంటూరు నగరాన్ని సుందరంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ప్రసంగిస్తూ రాజకీయ విలువలు పతనం అవుతున్న నేటి పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం,సమాజం కోసం అహర్నిశలు పాటుపడిన వారికి ఉన్నత పదవులను అందించడం అభిలషణీయమన్నారు.ఈ అభినందన సభ కార్యక్రమంలో డిసీసీబి ఛైర్మెన్ ఆర్.రామాంజనేయులు, ప్రముఖ విద్యా వేత్త కన్నా మాస్టర్, ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయ సారథి,రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ సి.హెచ్ చక్రపాణి,ప్రముఖ సాహితీవేత్త మోదుగుల రవికృష్ణ,ప్రొ”రామిరెడ్డి, వైయస్సార్ సిపి నాయకులు తుళ్లూరి సూరిబాబు, వలీ వీరారెడ్డి, చైతన్య గోదావరి బ్యాంకు ఆఫీసర్ వీరారెడ్డి తదితరులు ప్రసంగించారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో వివిధ వర్గాల నేతలు శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు, పూలదండలతో శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పి రెడ్డిని ఘనంగా సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *