మాదకద్రవ్యాల వినియోగంతో మానవ వనరులు నిర్వీర్య0.. మేకతోటి సుచరిత

1 min read

గుంటూరు:ప్రపంచంలో మాదక ద్రవ్యాల వినియోగంతో మానవ వనరులు నిర్వీర్యమౌవుతున్నాయని శ్రామిక ఉత్పాదక శక్తి తగ్గుతుందనిరాష్ట్ర హోంశాఖమాత్యులు మేకతోటి సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో గుంటూరులోని మద్య విమోచన ప్రచార కమిటీ కార్యాలయ హాలులో జరిగిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధం,అక్రమ రవాణ, వ్యతిరేక దినోత్సవం సభకు మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.ముఖ్యఅతిథిగా హాజరైన హోం శాఖ మాత్యులు మేకతోటి సుచరిత ప్రసంగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ మద్యం, మాదకద్రవ్యాల నిరోధం కోసం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ను ఏర్పాటు చేసి అక్రమాస్తుల కు సింహస్వప్నంగా మార్చారని తెలిపారు.మాదక ద్రవ్యాలతో యువత నిర్వీర్యం అవుతుందని భావితరాల ఉజ్వల భవిష్యత్తు పతనమౌవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాలను వినియోగిస్తున్న యువత దొంగతనాలకు,అత్యాచారాలకు పాల్పడుతున్నారని తెలిపారు. చిన్న వయసు లోనే మరణాలు సంభవించడానికి ఆల్కహాల్, మద్యం వినియోగం కారణ భూతాలు అవుతున్నాయని పేర్కొన్నారు. మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ 1989 నుండి జూన్ 26 న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంని ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలునిర్వహిస్తున్నాయన్నారు.2021 సంవత్సరం నినాదంగా మాదక ద్రవ్యాల పై వాస్తవాలను తెలుసుకుందాం! జీవితాన్ని కాపాడుకుందాం!! అనే నినాదాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించి ప్రజలను జాగృతులను చేస్తుందన్నారు.మాదక ద్రవ్యాలతో ప్రపంచవ్యాప్తంగా 400 బిలియన్ డాలర్ల అక్రమ వ్యాపారం జరుగుతుందని ప్రపంచంలో దాదాపు 30 కోట్ల మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారని పేర్కొన్నారు. భారతదేశంలో దాదాపు 20 కోట్ల మంది ఆల్కహాల్ కు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి అనారోగ్య పాలుఅవుతున్నారుని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్య నియంత్రణ కోసం చేపట్టిన బహుముఖ కార్యక్రమాల ఫలితంగా గత రెండు సంవత్సరాల్లో 30 శాతం మద్యం వినియోగం,70 శాతం బీరు వినియోగం తగ్గిందని ఈ మార్పు భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదన్నారు.స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ కే.శ్రీనివాస్ ప్రసంగిస్తూ విశ్వవిద్యాలయాలు,కాలేజీలలో అవగాహన సదస్సులు నిర్వహించి మాదకద్రవ్యాల పై విద్యార్థులను చైతన్య వంతులను చేయాలన్నారు. ప్రముఖ మానసిక వైద్య నిపుణులుజన చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.విజయ సారథి ప్రసంగిస్తూ మాదక ద్రవ్యాలు యువత పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని తల్లిదండ్రులు వారి బిడ్డల ప్రవర్తనను గమనించి వ్యసనానికి బానిసలు అయితే మెరుగైన వైద్యం కొరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయిలో ని అన్ని గవర్నమెంట్ హాస్పటల్ లో ఉచితంగా ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ కేంద్రాలకు పంపి చికిత్స పొందాలన్నారు. ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్ ప్రసంగిస్తూ పాఠ్యాంశాలలో మత్తు పానీయాల దుష్ఫలితాల పై ఒక పాఠాన్ని చేరిస్తే చిన్నవయసులోనే వారికి వాటి దుష్ఫలితాలను తెలియజేయడం ద్వారా వారి జీవితాలను కాపాడగలమన్నారు.ఈ సమావేశంలో రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ సి.హెచ్ చక్రపాణి, జన చైతన్య వేదిక నేతలు తుళ్లూరు సూరిబాబు, పదవ వార్డ్ కార్పొరేటర్ షేక్.మీరా వలి, చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నేత వీరారెడ్డి పాల్గొని ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *