నర్సంపేటలో 6వ విడత హరితహారం

తెలంగాణ

“6వ విడత హరితహారం”లో భాగంగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వ్యవసాయ గ్రేన్ మార్కెట్ నందు మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించిన నర్సంపేట శాసనసభ సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ

మొదటి మూడు విడతల్లో ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ మొక్కలు నాటి రాష్ట్రస్థాయిలోనే హరితహారంలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందానని అన్నారు. అదే స్ఫూర్తితో ఈ సారి కూడా నియోజకవర్గంలో 30 లక్షల మొక్కలు నాటాలని ప్రణాళిక రూపొందించారు. ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులు అధికారులకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నాటిన మొక్కలను 85% బ్రతకాలని వాటిని సంరక్షించాలి అని అన్నారు. సంరక్షించే మొక్కల రక్షణ బాధ్యత సరిగా చేపట్టకపోతే అట్టి అధికారులు ప్రజా ప్రతినిధులు పై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

మున్సిపల్ కౌన్సిలర్ వారివారి వార్డుల్లో అత్యధిక మొక్కలు నాటాలని ఎవరైతే అత్యధిక మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తా రో వారికి ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ హరిత నిధులు ఇవ్వబడతాయని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి, ప్రతి ఒక్కరు తమ వంతు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి గౌరవ ముఖ్యమంత్రి గారు తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసి “ఆకుపచ్చ తెలంగాణగా” తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మొక్కలు నాటడంలో ఎలాంటి ఉత్సాహం చూపుతారు వాటిని సంరక్షించే బాధ్యతలో కూడా అంతే శ్రద్ధతో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *