నిబంధనలు పాటించని కస్టమర్స్ ను బ్యాంకుల్లో కి అనుమతించ వద్దని విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి ఆదేశించారు

విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి, ఐపీఎస్ జూలై 9న విజయనగరం పట్టణంలోని ఎస్ బి ఐ ఫోర్ట్ బ్రాంచ్ నీ సందర్శించి, బ్యాంకులో రద్దీని పర్యవేక్షించి, కౌంటర్ల వద్ద కస్టమర్స్ భౌతిక దూరం పాటించే విధంగా, మాస్క్ ధరించే విధంగా చూడాలని, నిబంధనలు పాటించని కస్టమర్స్ ను బ్యాంకుల్లో కి అనుమతించ వద్దని బ్యాంకు అధికారులను ఆదేశించారు.

Continue Reading

లంచంతీసుకుంటూ పట్టుబడ్డ మిషన్ కాకతీయ ఇరిగేషన్ ఏఈ

భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఏసీబీ రైడ్ లంచంతీసుకుంటూ పట్టుబడ్డ మిషన్ కాకతీయ ఇరిగేషన్ ఏఈ నవీన్ కుమార్ గుండ్లరమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద నుంచి లక్షా ఇరవై వేలరూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.

Continue Reading

ON LINE క్లాసులు నిర్వహించ కూడదు

కరోనా నేపథ్యంలో ఇంకా విద్యా సంవత్సరాన్ని ఖరారు చేయలేదని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిసిందని అలా నిర్వహించడానికి వీల్లేదని అన్నారు. అలాగే కొన్ని స్కూల్స్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వం చెప్పే వరకు ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి వీలు లేదన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

Continue Reading

మళ్ళీ ఉచిత రేషన్

మళ్ళీ ఉచిత రేషన్ కందిపప్పు కూడా ఉచితంగా పంపిణీ  పంచదారకు పెంచిన ధర వర్తింపు  ప్రధాని ప్రకటనతో మారిన నిర్ణయం  రాష్ట్రంలోని పేదలకు ఈ నెల కూడా రేషన్‌ ఉచితంగానే అందనుంది. లాక్‌డౌన్‌ సమయంలో పేద కుటుంబాలకు ఉచిత రేషన్‌ ఇవ్వాలన్న ప్రధాని మోదీ ప్రకటనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ నెల నుంచి నగదుకే సరుకులు ఇవ్వాలని తొలుత భావించినప్పటికీ ఇప్పుడు వెనక్కి తగ్గింది. బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇచ్చినా, పంచదార […]

Continue Reading

పుట్టుకతోనే అంధుడైనా పట్టుదలతో IAS సాధన

పుట్టుకతోనే అంధుడైనా పట్టుదలతో ఐఏఎస్‌ సాధన 2019 బ్యాచ్‌లో 457వ ర్యాంకు సాధించి ముస్సోరీలో శిక్షణ  గోదారమ్మ ఒడిలో పుట్టి విద్యలనగరంలో కొలువు సంకల్పం తోడుంటే వైకల్యం అవరోధం కాదని నిరూపించారు. అంధత్వాన్ని జయించి… అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ఆ దైవాన్ని ఎదిరించి.. పేదరికాన్ని తలదించేలా చేశారు. కష్టాల వారధి దాటి… అనంద ప్రయాణం చేస్తున్నారు. ఆయనే… తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం, గూడపల్లి గ్రామానికి చెందిన కట్టా సింహాచలం. 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌లో 457వ ర్యాంకు సాధించి […]

Continue Reading

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసింది

మంగళవారం ఉదయం నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసింది. గడిచిన 24 గంటల్లో 4,970 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 134 మంది మృతి చెందడం మరింత ఆందోళనగా మారింది. ఇప్పటివరకూ భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 1,01,139కి చేరగా.. మృతుల సంఖ్య 3,163కు చేరింది కాగా కరోనా వైరస్‌ నుంచి 39,173 మంది పూర్తిగా కోలుకోగా దేశంలో ప్రస్తుతం 58,802 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు […]

Continue Reading