ఎక్కడ  మాస్కులు లేవు ?

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

నాయుడుపేట లో సామజిక దూరం ఎక్కడ  మాస్కులు లేవు  బైతిక దూరం అంతకన్నా లేదు  కరోన నియంత్రణ ఇంకెప్పుడు .

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU

సూళ్లూరుపేట నియోజక వర్గ పరిధి లోని    మాస్కు లు ధరించాలని అలాగే బైతిక ధూరం పాటించాలని అలా పాటిస్తూ వారి వారి పనులను కొనసాగించు కోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది . అయితే చాలా మంది నిబంధనలు విరుద్ధం గా నడుచుకుంటున్నారు . కానీ నాయుడుపేట పట్టణం లో మాస్కులు ధరించడానికి ప్రజలు పూర్తి గా స్వస్తి పలికారు  అనే చెప్పాలి .
అదే విధం గా మనిషి కి మనిషి కనీసం అడుగు దూరం పాటిచాలన్న సంగతి కూడా మరిచి పోయి  మనిషి మనిషి రాసుకుంటూ రుద్దుకుంటు తిరుగు తున్నారు తప్ప సామజిక దూరం చూద్దామన్నా కంటికి కనిపించకుండా పోతోంది అని పలువురు వాపోతున్నారు . ముఖ్యం గా నాయుడుపేట లో ఉన్న ఇండియన్ బ్యాంకు వద్ద సామాజిక దూరం పాటించకుండా మనిషి పై ఎలా రుద్దుకుంటూ  పొతు ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు . ఏ వక్కరి కైనా  కరోన ఉందని తెలిస్తే అంతే సంగతి మరి . చెప్పి రాదు కరోనా మహమ్మారి మనకు . అన్నిటికి మించి  నాయుడుపేట పట్టణం లో ఉన్న అన్ని బ్యాంక్ ల వద్ద సెక్యూరిటీ సిబ్బంది లేక పోవడం విశేషం అంతే కాకుండా ఎటిఎం గదుల్లోనూ పది మంది వరకు నిలబడి వుంటున్నారు . నాయుడుపేట నియోజక వర్గమైన సూళ్లూరుపేట లో  రోజు రోజుకు కరోన పాజిటివ్ కేసులు మరింత గా నమోదు అవ్వడం తో ప్రజలు సామాజిక దూరాన్ని నియంత్రణ లను పాటించక పోతే  నాయుడుపేట పట్టణం  లో కూడా కరోన వ్యాధి ప్రజలపై ఎక్కువగా తన ప్రభావాన్ని చూపు తుందని అలాగే మనమే కాకుండా మన కుటుంభం లోని వారు కూడా ఈ కరోనా భారిన పడక తప్పదని  నిపుణులు నాయుడుపేట   ప్రజలను హెచ్చరిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *