టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు భారీ గండి రూ. 7500 కోట్లకు పైగా

ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ బిజినెస్

చైనా యాప్‌లను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు భారీ షాకిచ్చింది. భారత్‌లో విస్తరించేందుకు సంస్థ రచించుకున్న వ్యూహాలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అంతుకుమునుపు బైట్ డ్యాన్స్ భారత్‌లో దాదాపు రూ. 7500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. సీనియర్ నాయకత్వ స్థాయిలో ఎంతో మంది భారతీయులను నియమించుకుంది. కానీ ప్రభుత్వం విధించిన నిషేధం.. కంపెనీ వ్యూహాలకు గండి కొట్టింది.

టిక్ టాక్ ఇండియా హెడ్ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్పందించారు. కేంద్రం తమను వివరణ కోరిందని ఆయన చెప్పుకొచ్చారు. సమాచార భద్రత, గోప్యత విషయంలో తాము ప్రభుత్వం విధించిన నియమాలన్నీ పక్కాగా పాటిస్తున్నామన్నారు. చైనాతో సహా ఇతర దేశాలకు భారతీయుల వివరాలు తమ ద్వారా అందవని స్పష్టం చేశారు. కానీ భారత్‌లో టిక్ టాక్ విస్తరణ వ్యూహాలపై మాత్రం ఆయన మౌనం దాల్చారు.

మరోవైపు  చైనాతో ఘర్షణ నేపథ్యంలో చైనా యాప్‌లను నిషేధించాలని కేంద్రం నిర్ణయించుకున్నప్పటికీ..తాజా ఉత్తర్వుల్లో ఎక్కడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. కేవలం దేశం సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, ప్రజల సమాచార భద్రత దృష్ట్యా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. దీంతో భారత్ ఆన్‌లైన్ ప్రపంచం నుంచి టికాటాక్ అదృశ్యమైనట్టేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో టిక్‌టాక్ తన కార్యకలాపాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *