కావలి లో ముగ్గురు సభ్యుల గల గుట్కాముఠా అరెస్టు

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

కావలి లో ముగ్గురు సభ్యుల గల గుట్కాముఠాను అరెస్టు చేసిన పొలీసులు 15లక్షల రూపాయల విలువైన నిషేదిత గుట్కా పొగాకు ఉత్పత్తుల ను స్వాదీనం చేసుకున్న 1టౌన్ సిఐ శ్రీనివాసరావు. 5800/- రూపాయల విలువగల 34 మద్యం బాటిల్స్ , స్వాదీనం. ఇప్పటి వరకు 13 మంది ని అరెస్టు చేసిన కావలి పొలీసులు. కరోనా లాక్ డౌన్ సమయాల లో ఈ రోజు నుండి మార్పులు ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 1గంటవరకు నిబందన వేళలు సడలింపు. మధ్యాహ్నం 1గంట నుండి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు 144సెక్షన్ అమలులో ఉంటుందన్న డియస్పీ ప్రసాదు.

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని స్థానిక డియస్పీ ఆవరణలో డియస్పీ ప్రసాదు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. డియస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు గుట్కా పొగాకు ఉత్పత్తుల ను అక్రమంగా తరలిస్తున్న గుట్కాముఠాను అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుండి 4662280/- స్వాదీనం చేసుకున్నామని, వీరే కాక ఇంకా కొంత మంది సభ్యులు ఉన్నారని వారిని కూడా త్వరలో పట్టుకుంటామని. అలాగే గుట్కా పొగాకు ఉత్పత్తుల లో పట్టుబడి కేసుల లో ఉంటే అట్టి వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయటం జరుగుతుందని. డియస్పీ డి ప్రసాదు తెలిపారు.

1.డి ప్రసాదు డియస్పీ కావలి డివిజన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *