సామాన్య ప్రజలపై భారం పడే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU

సామాన్య ప్రజలపై భారం పడే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్

ఎస్ ఎస్ వీ కలికిరి స్థానిక మండల కేంద్రంలో సోమవారం వాడా గంగురాజు దార్నాను నిర్వహించారు ew సందర్బంగా వారు మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా గత పది రోజుల్లోనే 14 రూపాయలు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త నిరసనలు భాగంగా మంగళవారం కలికిరి మొరువ సర్కిల్లో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది.
ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ మన దేశంలో మాత్రం రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలు భారీ స్థాయిలో పెంచడం దుర్మార్గమన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దేశంలో విస్తరిస్తూ ఉంటే లాక్ డౌన్ కొనసాగించడం వలన ప్రజలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు కేంద్ర ప్రభుత్వం ప్రజలపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే అన్ని రకాల నిత్యావసర వస్తువులపై ధరల ప్రభావం చూపుతుందని దీంతో పేద మధ్య తరగతి సామాన్య ప్రజలు పై భారం పడుతుందన్నారు. వెంటనే పెంచిన డీజిల్ పెట్రోలు ధరలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా కార్మికులు నాలుగు నెలలుగా ఉపాధి లేక కుటుంబాలు పస్తులు ఉంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఇంకా ఉపాధి లేకుండా చేయడం ఏమిటని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకులు అలా బస్సు రెడ్డప్ప వెంకటరమణ నరసింహులు లతోపాటు కార్మికులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *