అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు అనుమతినిస్తూ కేంద్ర కేబినెట్​ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ

అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు అనుమతినిస్తూ కేంద్ర కేబినెట్​ నిర్ణయం తీసుకుంది

ఈ నేపథ్యంలో రాకెట్లు- ఉపగ్రహాల తయారీలో ప్రైవేటు సంస్థలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు ఇస్రో ఛైర్మన్​ కే. శివన్​.

ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నప్పటికీ  ఇస్రో కార్యకలాపాలు యథావిధిగా సాగుతాయని పేర్కొన్నారు.

రాకెట్లు- ఉపగ్రహాల తయారీ, ప్రయోగ సర్వీసుల్లో ఇకపై ప్రైవేటు రంగానికి అనుమతి ఉంటుందని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ఛైర్మన్​ కే. శివన్​ వెల్లడించారు.

ఇంటర్​ ప్లానెటరీ మిషన్స్​లో కూడా ప్రైవేటు సంస్థలు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

భారతీయ అంతరిక్ష రంగంలో ప్రయోగాలు చేపట్టేలా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం కోసం ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌, ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పేస్‌) అన్న కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది.

ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చినప్పటికీ ఇస్రో కార్యకలాపాలు తగ్గవని శివన్​ స్పష్టం చేశారు.

ఆధునిక పరిశోధన- అభివృద్ధి, మానవసహిత అంతరిక్ష యాత్ర సహా అన్ని పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *