పెంచిన డీజల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని సూళ్లూరుపేట లో ధర్నా కార్యక్రమం నిర్వహించిన  భారత కమ్యూనిస్ట్ పార్టి (మార్క్సిస్ట్)

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

పెంచిన డీజల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని సూళ్లూరుపేట లో ధర్నా కార్యక్రమం నిర్వహించిన  భారత కమ్యూనిస్ట్ పార్టి (మార్క్సిస్ట్) 

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU

స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట పట్టణం లో మంగళవారం నాడు  భారత కమ్యూనిస్ట్ పార్టి (మార్క్సిస్ట్) సూళ్లూరుపేట విభాగము వారు  సూళ్ళురుపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద ,  పెట్రోలు డీజలు ధరల పెంపు పై ధర్నాకార్యక్రమం  నిర్వహించారు .  అనంతరం వారు స్థానిక మునిసిపల్ కమీషనర్ యెన్ . నరేంద్ర కుమార్ కు    వినతి పత్రము సమర్పించారు . ఈ సందర్భం గా పార్టి కార్యదర్శి కామ్రేడ్  పద్మనాభయ్య మాట్లాడుతూ కరోనా మహమ్మారి తో  ప్రజానీకం  బతుకులు అతలా కుతల మౌతుంటే , కేంద్ర ప్రభుత్వము ఇదే అదును గా  నిత్యము  పెట్రోలు , డీజిల్  ధరలను పెంచి జనం  నడుము విరగ్గొడు తున్నారని అంటున్నారు . ఒక వైపు ప్రపంచము లో బారెల్ కూడాయిల్  ధరలు  తగ్గుతుంటే వినియోగదారులకు రేట్లు పెంచి ఆ లాభాన్నికార్పొరేట్లకు లక్షా  నలబై ఐదు  కోట్లు రాయతీ లివ్వడం మోడి ప్రభుత్వ దమని నీతి కి పరాకాష్ట అంటూ న్నారు. మోడి ప్రభుత్వము గత ఆరు  సంవత్సరాలలో పెట్రోలు మీద పన్ను రూపాయల నుండి  తొమ్మిది  రూపాయల నుండి  33 రూపాయ లకు పెంచిందని , అలాగే డీజిల్ పై పన్ను  రూ. 3.50 నుండి రూ 32 కు పెంచడము వలన  వ్యవసాయం, నిత్యావసర వస్తువులు , ప్రయాణం ఖర్చులు  విపరీతం గా ధరలు  పెరిగాయని దీనిని రాష్ట్ర వామ పక్షాలు తీవ్రం గా ఖండిస్తూ , పెంచిన ధరలను   వెంటనే తగ్గించాలని డిమాండు చేస్తున్నామన్నారు. ఈ నిరసన  కార్యక్రమము లో కామ్రేడ్  మనోహర్ , అల్లెయ్య ,  రాజుబాబు , చంద్రయ్య , రమణ రావ్ , వెంకటేశ్వర్లు , సుబ్రమణ్యం తదితరులే కాకుండా  మహిళా సభ్యురాళ్లు కూడా  హాజరవడం విశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *