స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి శ్రీ పి వి నరసింహారావు గారు శత జయంతి

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి

SSV NEWS :  PRASAD BABU KOPPINEEDI Incharge, Eg.Dt.,

రాజమండ్రి రూరల్ స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి శ్రీ పి వి నరసింహారావు గారు శత జయంతి సందర్భంగా వై ఎస్ ఆర్ సి పి రాజమండ్రి రూరల్ కార్యాలయంలో మన రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ శ్రీ ఆకుల వీర్రాజు గారు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీర్రాజు గారు మాట్లాడుతూ, తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి శ్రీ పి వి నరసింహారావు గారు అని, రాష్ట్ర మంత్రి గా, ముఖ్యమంత్రి గా, కేంద్రమంత్రి గా, ప్రధానమంత్రి గా అనేక పదవులను సమర్ధవంతంగా నివరహీంపదగిన గొప్ప రాజ నీతిజ్ఞుడు అని, 14 భాషలు అనర్గళంగా మాట్లాడటమే గాక, అనేక రచనలు చేసిన గొప్ప సాహిత్య వేత్త అని, ఆయనకు భారత ప్రభుత్వం భారత రత్న అవార్డును ఇచ్చి గౌరవించాలని యావత్తు తెలుగు జాతి ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల బాపిరాజు గారు, దేవలంక రాము గారు, దేవలంక రాజేష్ గారు వై ఎస్ ఆర్ సి పి నాయకులు కురుమళ్లా ఆంజనేయులు గారు, వి టివి సుబ్బారావు గారు, మద్దాల అను గారు, త్యాగరాజు గారు, సుబ్బారెడ్డి గారు, రవి, ముద్రగడ శ్రీనివాసరావు, తదితరులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *