సూళ్లూరుపేట రోటరీ క్లబ్ లో అధ్యక్షురాలి గా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న సుంకర ప్రతిమ

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

సూళ్లూరుపేట రోటరీ క్లబ్ లో అధ్యక్షురాలి గా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న సుంకర ప్రతిమ  

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU

స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట పట్టణం లోని పురపాలక సంఘం పక్కన ఉన్న రోటరీ క్లబ్ లో  2020 – 2021 సంవత్సరం నకు గాను అధ్యక్షురాలి గా నేడు అనగా బుధవారం నాడు స్థానిక నివాసి ఐన శ్రీమతి  సుంకర ప్రతిమ ప్రమాణ స్వీకారం చేయ నున్నానని  తెలిపారు   . వివరాల్లో కెళితే చక్కటి విద్యావంతురాలైన ప్రతిమ  నెల్లూరు లోని  డి కె డబ్లు కాలేజీ లో బి . కామ్ పూర్తి చేసి తదుపరి వివాహానంతరం తన భర్త దయా సహాయ సహకారాలందించడం తో  మనకు పక్క రాష్ట్రమైన తమిళ్ నాడు లోని  మదరాసు లో ఏం సి ఏ పూర్తి చేసానని అన్నారు . గతం లో తాను ఈ సూళ్లూరుపేట రోటరీ క్లబ్ కు సెక్రటరీ గా పని చేసానని , అప్పుడు తన లోని ఉత్సహాన్ని మరియు పని విధి విదానాలను గుర్తించిన  జిల్లా  రోటరీ క్లబ్ సంస్థ వారు  తనను అధ్యక్షురాలి గా ఉండేలా ఉత్తరువులు జారీ చేయగా  తాను ఆ సమయం లో ఓ అత్తమ్మ కు కోడలి గా ఓ భర్తకు భార్య గా  అలాగే ఓ గర్భిణీ స్త్రీ గా తనకు తలకు మించిన బాధ్యత లు నిర్వర్తిస్తానో లేదో అన్న సంశయం తో తను సూళ్లూరుపేట రోటరీ క్లబ్ అధ్యక్షురాలి పదవి ని చేజార విడుచు కున్నానని   అన్నారు . అంతే కాకుండా తాను గతం లో  కార్యదర్శి గా రోటరీ క్లబ్ లో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఆ సమయం లో జిల్లా రోటరీ క్లబ్  యూనిట్ సభ్యులు తన సేవలను గుర్తించి నాడు తనకు “ఉత్తమ కార్యదర్శి” గా 2016 – 2017 లో సంవత్సరానికి గాను అవార్డు నందు కున్నానని అన్నారు . ఈ సందర్భం గా జిల్లా రోటరీ క్లబ్ వారికి స్థానిక రోటరీ క్లబ్ లో పలు పదవులు చేపట్టి రోటరీ క్లబ్ ను ఓ మంచి సంస్థ గా  గుర్తింపు తీసుకురావడానికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియ జేస్తున్నారు .  తాను సూళ్లూరుపేట రోటరీ క్లబ్ కుఅధ్యక్షురాలి గాను  పదవి ని చేపట్టిన తరువాత తొలుత గా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మనదాకా వచ్చిన కరోనా మహమ్మారి ని తరిమి కొట్టడం లో తమ రోటరీ క్లబ్ తరపున చేతనైనంత గా కాస్త పది పని చేస్తామని అలాగే పేద వారైనా , అందుబాటు లో ఉన్న వారందరికీ కరోనా వైరస్ ను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్త లపై ఆవగాహన మరియు వారికి మాస్క్ లు గాని శానిటైజర్లు గాని వీలైనన్ని పంపిణి చేయడం గాని అలాగే పర్యావరణ , రైతు లకు సంబంధించిన కొత్త ప్రాజెక్టులు వాటిపై సలహాలు సూచనలు వారికి అందజేయడం వంటి వాటిపై ద్రుష్టి మళ్లిస్తానని వారు చివరిగా అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *