దొరవారి సత్రం లో   గొడుగు లతో ర్యాలీ కార్యక్రమం  కోవిడ్  – 19 నివారణ పై  ఆవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

దొరవారి సత్రం లో   గొడుగు లతో ర్యాలీ కార్యక్రమం  కోవిడ్  – 19 నివారణ పై  ఆవగాహన కార్యక్రమం

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సూళ్లూరుపేట నియోజక వర్గ పరిధి లోని దొరవారిసత్రం మండలం లో మండల సమాఖ్య ఆధ్వర్యం లో సోమవారం దొరవారిసత్రం లోని అంగన్వాడీ స్కూల్ నుండి మండల కార్యాలయం వరకు గొడుగు లతో భౌతిక దూరం పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ పై అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు . అనంతరం కరోనా బాధితులు ఎక్కువగా నమోదు ఔతున్న కారణం గా ప్రజలకు కోవిద్- 19 పై ఆవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సామాజిక దూరం గురించి , మరియు మూతికి ముక్కు కు మాస్క్ యెంత వరకు అవసర మంన విషయాన్ని దాని ని ఉపయోగిస్తే వచ్చే లాభ నష్టాలు గురించి ఆవగాహన కల్పించుటకు గొడుగుల ర్యాలీ ని నిర్వహించడం జరిగింది . ఈ ర్యాలీ లో “పాటిద్దాం పాటిద్దాం . సామాజిక దూరం పాటిద్దాం . కరోనా మహమ్మారి ని తరిమి కొడదాం” అంటూ నినాదాలు చేసారు . ఈ కార్యక్రమం లో ఏపీఎం కె . రాజారెడ్డి సీసీ లు సి హెఛ్ . నారాయణ , చంద్రయ్య , ఉష , సంఘబందం అధ్యక్షులు పెంచలమ్మ మరియు  సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *