సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ నాయకులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను చింపి వేసిన సంఘటన పై

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి

SSV NEWS- PRASAD BABU KOPPINEEDI, INCHARGE, EG.DT.

రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్ రామ్ గారి పార్టీ కార్యాలయం వద్ద SC, BC సామాజిక వర్గానికి సంబంధించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేసిన సంఘటనపై ఈరోజు స్థానిక బొమ్మూరు పోలీస్ స్టేషన్ నందు దుండగులను త్వరగా గుర్తించాలని వారిని శిక్షించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్, వైయస్సార్ సిపి సీనియర్ నాయకులు అజ్జరపు వాసు గారి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ మరియు బిసి సామాజిక వర్గానికి సంబంధించిన సిఐ (CI ) గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
అలాగే రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ గారిని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బర్రే కొండ బాబు గారు,గుత్తుల మురళీధరరావు గారు వైయస్సార్ సిపి ప్రముఖ దళిత నాయకులు SUPER 60 MP టీం సభ్యులు గుడాల ప్రసాద్ గారు, ఆరె చిన్ని గారు,ఎల్ వి ప్రసాదరావు గారు , వైయస్సార్ సిపి ప్రముఖ బీసీ నాయకులు , మజ్జి అప్పారావు గారు , కడలి వెంకటేశ్వరరావు గారు, మార్గాని సురేష్ గారు , కుంచ సత్య గారు, బుడ్డిగ శ్రీను గారు, నందం స్వామి గారు, మీసాల గోవింద్ గారు, మణికంఠ రెడ్డి గారు, అందానపల్లి సత్యనారాయణ గారు , చెల్లుబోయిన మూర్తిగారు, కర్రి సతీష్ గారు,అన్నపూర్ణ రాజు గారు , గుడాల ఆదిలక్ష్మి గారు , మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *