ఉరుములు పిడుగులతో వర్షం…

కృష్ణ

అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో అవనిగడ్డ,చల్లపల్లి, నాగాయలంక,కోడూరు మండలాల్లో ఉరుములు పిడుగులతో వర్షం…

నాగాయలంక మండలంలోని దిండి గ్రామంలో కట్టా పెద్దరత్తయ్య కి చెందిన 2 తాటిచెట్లు మీద ఏకకాలంలో ఒక్కసారే పిడుగులు పడటంతో స్థానికులు వెంటనే స్పందించి పొలాలకు చల్లే టైవాన్ పంపుల సహాయంతో తాటిచెట్లు మీద ఉన్న మంటలను అదుపుచేశారు… పగలు టైం కావడంతో చాలవరకు ఆస్తినష్టం తగ్గింది అదే రాత్రి సమయంలో అయితే భారీ ఆస్తినష్టం జరిగేదని…కట్టా పెద్దరత్తయ్య వాళ్ళ అన్నదమ్ములవి పక్క పక్కనే నాలుగు పూరిళ్లు దగ్దం అయ్యేవని వాపోయారు…అయితే ఈ పిడుగుల కారణంగా గ్రామంలోని ఎలక్ట్రానిక్ వస్తువులు (టి.వి, ఫ్రిజ్ ) కాలిపోయాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *