పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి

ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కడప

రాయచోటి : SSV NEWS REPORTER : SAMBA MURTHY

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో మంగళవారం రాయచోటి బస్టాండ్ సమీపంలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి సిద్ది గళ్ళ శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జూన్ 7 నుంచి దశలవారీగా పెట్రోల్ డీజలు ధరలు పెంచుతూ సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గుతూ ఉంటే మన దేశం మాత్రం రోజురోజుకు పెంచుతున్నారని ఒకవైపు లాక్ డౌన్ ప్రభావంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు సాయం చేయకపోగా పెట్రోల్ బాంబులు పేలుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని తక్షణం పెంచిన పెట్రోల్ ,డీజలు ధరలు తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లో ఏ ఐ టి యు సి సీనియర్ నాయకులు వెంకటేష్, సిపిఐ నియోజకవర్గ సభ్యులు చన్ రాయుడు , అశోక్ ,బి.ఆంజనేయులు, వెంకటరమణ, అంజి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *