మీకోసం మేమున్నాం….ఇంటి నుంచి బయటకు రావద్దు

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

మీ కోసం మేమున్నాం….మీరు ఇంటి నుంచి బయటకు రావద్దని చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, వై ఎస్.అర్ కాంగ్రెస్స్ యువ నేత మండ్ల సురేష్ బాబు ప్రజలను కోరారు.లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆశ్రయ కేంద్రాలలో వున్న అభాగ్యులకు చేగువేరా ఫౌండేషన్ అండగా నిలిచి ఆదుకుంటుంది.అందులో భాగంగా గురువారం లాక్ డౌన్ లో అహర్నిశలు పనిచేస్తున్న మునిసిపల్ కార్మికులకు భోజనాలను కమిషనర్ ఓబులేసు చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ చేగువేరా ఫౌండేషన్ విపత్కర పరిస్థితులలో ప్రజలకు, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు,కార్మికులకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు సురేష్ బాబు మాట్లాడుతూ సమాజం పై కరోనా ప్రభావం చూపకుండా అధికార యంత్రాంగం అహర్నిశలు కష్టపడి పనిచేసి ప్రజలకు రక్షణగా నిలవడం గొప్ప విషయమన్నారు. శానటరి సిబ్బంది పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం వల్ల వ్యాధులు ప్రబలకుండా నివారించ గలుగుతున్నారన్నారు.

పోలీసులు, పారిశుధ్య కార్మికులు,మీడియా ప్రతినిధులు సేవలు ఈ సమయంలో సమాజానికి ఎంతో ఉపయోగ పడుతున్నాయన్నారు.ప్రజలు ప్రభుత్వానికి సహకరించి వ్యక్తిగత పరిశుభ్రత,స్వీయ రక్షణ,సామాజిక దూరం పాటించి ఇంటి నుంచి బయటకు రావద్దని కోరారు.ప్రజలు ఏ అవసరం వచ్చినా చేగువేరా ఫౌండేషన్ అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమం అనంతరం చవట పాలెం వర్మికులెట్ కంపెనీ లో వున్న వలస కూలీలకు ఆహారం అందజేశారు. జీఎస్అర్ మునిసిపల్ స్కూల్,న్యూ ఇందిరానగర్, నెల్లటూరు గిరిజన కాలనీ,చిల్లకూరు లో వున్న నిరాశ్రయులకు భోజనం అందించారు. ఈ కార్య క్రమంలో తహశీల్దార్ లీలరాణీ, చేగువేరా బృందం నరేష్ రెడ్డి,మధు రెడ్డి,ఈ కార్యక్రమంలో చేగువేరా పైలట్ టీమ్ .. వినోద్,పవన్,భాస్కర్,అజయ్, సంతన్ ,సాయి మహేష్, లక్ష్మీ నారాయణ, తరుణ్ తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *