రానున్న 24గంటల్లో భారీ వర్షాలు వాతావరణ శాఖ వారి హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

రానున్న 24గంటల్లో భారీ వర్షాలు వాతావరణ శాఖ వారి హెచ్చరిక

గత నాలుగు రోజులుగా తెలుగు రాష్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న 24 గంటల్లో మాత్రం ఉత్తర తెలంగాణ, రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో రానున్న 4రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇవాళ్టి నుంచి సోమవారం వరకు ఉత్తరాంధ్ర, దక్షిణకోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. శుక్రవారం నుంచి సోమవారం వరకు రాయలసీమలో భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. గురువారం గుంటూరు, ప్రకాశం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరుగా, ఇతర ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *