MLA రోజా మండల స్థాయి అధికారులతో అత్యవసర సమావేశం

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు

PUTTUR : SSV NEWS REPORTER : K. MAHESH

నగరి నియోజకవర్గం లో కరోనా బాధితులు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న కారణంగా మన ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు మండల స్థాయి అధికారులతో అత్యవసర సమావేశం జరిపారు.

ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరు పాటించాలని ప్రతి వ్యక్తికి మూడు మాస్కులు చొప్పున ప్రభుత్వం ఇచ్చినా వాటిని ధరించకుండా తిరగడం వలన అదేవిధంగా గా ఎవరి కుటుంబాన్ని కైనా కొత్తగా బంధువులు వచ్చిన వారిని టెస్ట్ చేయించి ఇంటిలోపలికి తీసుకోవాలని అలా చెప్పకుండా దాచి పెట్టుకోవడం వలన వైద్యుల ఇళ్లల్లో కూడా కేసులు నమోదయ్యాయని

ప్రభుత్వం ఎంత చెప్పినా వినకుండా ప్రజల నిర్లక్ష్యం వల్లనే ఈ వైరస్ వ్యాపిస్తుందని కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటిస్తేనే ఈ కరోనా ని కట్టడి చేయగలమని, మరియు ప్రస్తుతం నగరి ఉన్న పరిస్థితులలో రెండు, మూడు రోజుల్లో లాక్డౌన్ అమలు పరచాలని ఆటోల ద్వారా ప్రజలకు పూర్తిగా అవగాహన కలిగించి ప్రజలు కూడా స్వచ్ఛందంగా లాక్డౌన్ కు సహకరించే విధంగా చేయాలని కోరారు

అలాగే ప్రతి ఒక్కరు కూడా బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వెళ్లే ముందు కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కుని వెళ్లాలని శానిటైజర్ తో చేతులు తరచు శుభ్రపరుచుకోవాలని, ఒక్కరి నిర్లక్ష్యం వలన ఆ కుటుంబం అనారోగ్యం పాలు కాకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరు మీద ఉందని సందేశాన్ని ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *