ఇస్రో ను ప్రవేటీకరణ చేయకండి

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU

భారత దేశానికి ప్రజలకు ప్రపంచం లోనే అత్యంత పేరు ప్రఖ్యాతలు గాంచిన శ్రీహరికోట రాకెట్ ప్రయోగ అంతరిక్ష పరిశోధన కేంద్రమైన షార్ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేటీకరణ చేస్తున్నాడని ఈ సంస్థ భారత ప్రజలది అని ప్రతి భారతీయుడు సగర్వం గా ఇస్రో శాస్త్రవేత్తల గురించి , అక్కడ పని చేసే ఉద్యోగస్తుల గురించి అలాగే కార్మికుల గురించి అలాగే రక్షణ సిబ్బంది గురించి అంటే కాకుండా రాకెట్ కేంద్ర నిర్మాణానికి భూమి  స్థలం ఇచ్చిన నాటి  వారి గురించి నాటి నుండి నేటి వరకు మన దేశం లోనే కాకుండా పరాయి దేశం లలో కూడా గర్వం గా చెప్పుకునే శ్రీహరికోట రాకెట్ నిర్మాణ కేంద్రాన్ని అంటే ఇస్రో ను కేంద్రం ప్రవేటీకరణ చేయడం ఎంతవరకు సమంజసమని సూళ్లూరుపేట భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్రాన్ని ప్రశ్నిస్తోంది . శ్రీహరికోట లో ఎప్పటి వరకు ప్రయోగించిన పిఎసైల్వి మరియు జిఎసైల్వి రాకెట్ ప్రయోగాలను అతి తక్కువ వ్యయం తో మన శ్రీహరికోట మేధావులు (శాస్త్రవేత్తలు) ప్రయోగాలను చేపట్టి విజయవంతం చేస్తున్నారు . మనదేశానికే కాకుండా మనకు కూడా వన్నె తెచ్చే శ్రీహరికోట రాకెట్ కేంద్రాన్ని ప్రవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగించడం ఎంతమాత్రం సబబు కాదని అంటున్నారు వారు . అందువల్లే ఈ తరుణం లో ఇస్రో కేంద్రాన్ని ప్రవేటీకరణ చేయవద్దని సూళ్లూరుపేట భారతీయ కన్యునిస్ట్ పార్టీ  జాతీయ స్థాయి లో ఆందోళన కు పిలుపు నిస్తోందని అందులో భాగం గా వచ్చే నెల అంటే జులై రెండవ తారీఖున చలో శ్రీహరి కోట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వారు తెలుపు తున్నారు . ఈ  చలో శ్రీహరి కోట పిలుపు కార్య క్రమం లో సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె . నారాయణ , రాష్ట్ర కార్యదర్శి కె . రామ కృష్ణ , లు పాల్గొన్నారు . ఈ కార్యక్రమాన్ని విజవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమీషనర్ సభ్యులు మోదుగుల పార్థసారధి , సిపిఐ నియోజక వర్గ కార్యదర్శి ఏం . రమణయ్య , పట్టణ కార్యదర్శి  ఆనంద్ బాబు , ల సంయుక్త ప్రకటన లో తెలియ జెస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *