ZPTC గజ్జల శృతిరెడ్డి ఆధ్వర్యములో MLA చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU

జడ్.పీ.టీ.సీ గజ్జల శృతి రెడ్డి ఆధ్వర్యములో ఎం.ఎల్.ఏ చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ.

కే.వీ పల్లె, జూన్ 29;స్థానిక మండల పరిషత్ కార్యాలయము ఆవరణలో  మండల జడ్.పీ.టీ.సీ గజ్జల శృతి రెడ్డి అధ్యక్షతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమము పీలేరు ఎం.ఎల్.ఏ చేతుల మీదుగా జరిగినది.

ఈ సందర్భముగా శృతి రెడ్డి  మాట్లాడుతూ జగనన్న తన పాదయాత్ర సందర్బంగా ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత 90 శాతం విజయవంతంగా అమలుపరిచాడని.పార్టీ మ్యానిపెస్టోలోని నవరత్నాలను భగవద్గీత, బైబుల్, ఖురాన్ లాగా భావించి అమలు చేస్తున్నాడని ప్రశంసించారు.ఈ రోజు కొత్తగా మంజూరైన 270 మందికి పెన్షన్లు ఎం.ఎల్.ఏ గారి ద్వారా పంపిణీ కావడం ఆనందంగా ఉందన్నారు.

పెన్షన్లు పంపిణీ చేసిన పీలేరు ఎం.ఎల్.ఏ చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత తెలుగు దేశం ప్రభుత్వముతో సంవత్సరానికి ఒక్కసారి పెన్షన్లు మంజూరు చేసేవారని అదికూడా జన్మభూమి కమిటీ సభ్యులు సిపార్సు చేసిన తెలుగుదేశం కార్యకర్తలకే  దక్కేవని అన్నాడు. ప్రస్తుత ప్రభుత్వముతో పార్టీ, లింగ, వర్ణ, కుల, మతాలకు అతీతంగా సంవత్సరం పొడుగునా నిరంతరాయంగా పెన్షన్ల మంజూరు కొనసాగుతుందని అన్నారు. అనంతరం గర్నిమిట్ట మాజీ సర్పంచ్ యశోధమ్మ తోపాటు 200 మంది తెలుగుదేశం నుండి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎం.ఎల్.ఏ చింతల వారికి కండువా కప్పి వై.ఎస్.ఆర్.సీ పార్టీలోకి ఆహ్వానించారు.

పై కార్యక్రమములో మండల యువనాయకుడు గజ్జల శీను రెడ్డి, జయరామచంద్రయ్య, తహసీల్దార్ శిరీషా, ఎం.పీ.డీ.ఓ, పార్టీ మండల కన్వీనర్ వెంకటరమనారెడ్డి,  కిషోర్ కుమార్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *