గోవుల అక్రమ రవాణాను అరికట్టండి

ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కడప

రాయచోటి: SSV NEWS REPORTER :  SAMBA MURTHY

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోసంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని రాయచోటి అర్బన్ సీఐ రాజు మరియు రూరల్ సిఐ లింగప్ప లకు కు వినతి పత్రం సమర్పించారు . మన దేశ సంస్కృతిలో గోవుకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేడని గోవును హిందువులు దేవతల పూజిస్తారు అని అటువంటి గోమాతను సంరక్షించాల్సిన బాధ్యత మన పై ఎంతో ఉందని ప్రతిరోజు వందలాది గోవులను వివిధ రకాల భారీ వాహనాల ద్వారా చట్టానికి విరుద్ధంగా అక్రమ రవాణా సాగుతోందని తక్షణమే ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని అలాగే సంబంధిత అధికారులు గో రక్షణ చట్టం పైన ప్రజలకు అవగాహన కల్పించాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా సహా కార్యదర్శి ఎన్ వి సుబ్రహ్మణ్యం, బిజెపి నాయకులు హిందూ హెల్ప్ లైన్ సభ్యులు అశోక్ గజపతిరాజు, శివ ప్రసాద్, రాజా, సహదేవ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *