వినాయక సాగర్ పనులు త్వరగా పూర్తి చేయండి

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU

వినాయక సాగర్ పనులు త్వరగా పూర్తి చేయండి వినాయక సాగర్ చుట్టు వ్యర్ధాలు తొలగించండి వినాయక సాగర్ పనులు పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని కరకంబాడి రోడ్డు బొంతలమ్మ గుడి వద్ద ఉన్న వినాయక సాగర్ అభివృద్ధి పనులు పేస్ 1 స్మార్ట్ సిటీ లో భాగంగా 11 కోట్ల 36 లక్షల రూపాయలతో జరుగుతున్న పనులును సోమవారం సాయంత్రం ఇంజనీరింగ్ అధికారులతో మరియు వినాయక సాగర్ కాంట్రాక్టర్లతో కమిషనర్ గిరీష పరిశీలించి పనులన్నీ త్వరగా పూర్తిచేసి అనుకున్న సమయానికి అన్న ముందుగానే పూర్తిచేయాలని, వినాయక సాగర్ చుట్టూ వ్యర్ధాలు తొలగించి, మీకు ఇచ్చిన ఎనిమిది నెలలు గడువు లోపల పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ క్రింద వినాయక సాగర్ చుట్టూ చెట్లు, సుందరీకరణ, త్రాగునీరు, పార్కింగ్ వంటి సదుపాయాలతో ఆహ్లాదకరంగా వాతావరణము తో సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి పరచాలని తెలియజేశారు. మరో ఎనిమిది నెలలు వినాయక సాగర్ అందంగా ఏర్పాటు చెయ్యాలని తెలియజేశారు.
ఈసారికి వినాయక ఉత్సవాలకు నిమజ్జన చేసే ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకి అందుబాటులోకి తెచ్చి సిద్ధం గా ఉండాలని ఇంజనీరింగ్ అధికారులు మరియు కాంట్రాక్టర్లను ఆదేశించారు.

కమిషనర్ గిరీష వారితో పాటు ఇంచార్జ్ సూపర్డెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్,డీఈలు విజయ్ కుమార్ రెడ్డి, స్మార్ట్ సిటీ ఎయికాం బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *