పెట్రోల్ , డీసెల్ ధరలను పెంచి ప్రజాపై భారాలు మోపుతున్న బీ జె పీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU

పెట్రోల్ , డీసెల్ ధరలను పెంచి ప్రజాపై భారాలు మోపుతున్న బీ జె పీ ప్రభుత్వం

ఎస్ ఎస్ వీ కలికిరి పీలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆగమొహుద్దీన్ విలేకర్లతో మాట్లాడుతూ ఈరోజు సోమవారము 29-6-2020 పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం గడి గ్రామము నందు పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆఝూ మోహీధీన్ గారు ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ జీ గారు, పిసిసి ప్రెసిడెంట్ సాకే శైలజనాథ్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ లు తులసి రెడ్డిగారు,మస్తాన్ వలి గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు దూసుకుపోతున్నాయి అంటే అది బిజెపి ప్రభుత్వము యొక్క అసమర్ధత అని అన్నారు.మన ప్రధాన మంత్రి మోడీ గారు బీజేపీ ప్రభుత్వం వస్తే దేశానికి డెబ్భై ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనులు తాము చేస్తామని హామీ ఇచ్చిన వారు ఈ విధంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచి నిరూపించుకున్నారు. ఇది బిజెపి ప్రభుత్వానికే సాధ్యమైంది అని అన్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పన్నులు పెంచుకుంటూ ప్రజలను ఇబ్బంది పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి సెక్రెటరీ శ్రీ వర్ధన్ చౌదరి, పీలేరు మండల అధ్యక్షుడు ఎస్.కె మహబూబ్బాషా, నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు బి.ఆర్ మల్లికార్జున, కలికిరి మండలం ఉపాధ్యక్షుడు అంజద్ అలీ,కలికిరి మండలం మహిళ అధ్యక్షురాలు విజయ రెడ్డి, కలికిరి మండలం మైనారిటీ అధ్యక్షుడు షఫీ, పఠాన్ ఆధాం, సాజిద్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *