కరోనా కారణంగా వాయిదా పడ్డ AP బడ్జెట్ సమావేశాలు

అమరావతి ఆంధ్రప్రదేశ్

మార్చి నెలలో జరగాల్సిన ఏపీ బడ్జెట్ సమావేశాలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మూడు నెలల అవసరాల కోసం అప్పట్లో బడ్జెట్ ను తీసుకొచ్చారు. ఏప్రిల్, మే,జూన్ నెలలకు సంబంధించిన బడ్జెట్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, జూన్ నెలతో ఓటాన్ బడ్జెట్ ముగుస్తుంది. జూన్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తున్నది.

జూన్ నెలాఖరున ఈ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నది. అయితే, లాక్ డౌన్ విషయంపై స్పష్టత వచ్చిన తరువాత మాత్రమే దీనిని సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. మే 17 తో మూడోదశ బడ్జెట్ సమావేశం ముగుస్తుంది కాబట్టి దీని తరువాత ఈ విషయంపై స్పష్టత తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కేంద్రం రూ.20లక్షల కోట్ల రూపాయల ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీకి అనుగుణంగా ఏపి బడ్జెట్ ను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నది. నాలుగో దశ లాక్ డౌన్ తరువాత లాక్ డౌన్ ను ఎత్తివేసే అవకాశం ఉంటె కనుక బడ్జెట్ సమావేశాలు జూన్ నెలాఖరున ఏర్పాటు చేస్తారు. లేదంటే మరోసారి ఓటాన్ బడ్జెట్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *