భాజపా అగ్రనేతలకు న్యాయస్థానం పిలుపు

ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ

భాజపా అగ్రనేతలు ఎల్​.కె.అధ్వాని మురళీ మనోహర్ జోషిని బాబ్రీ మసీదు కేసులో విచారించేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సిద్ధమైంది. జులై 23న జోషి, జులై 24న ఎల్​.కె.అధ్వాని వాంగ్మూలాన్ని నమోదు చేయాలని నిర్ణయించింది.

బాబ్రీ మసీదు కేసులో భాజపా అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్​.కె.అధ్వాని వాంగ్మూలాన్ని జులై 24న నమోదు చేయాలని లఖ్​నవూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయించింది. సీఆర్​పీసీ సెక్షన్ 313 కింద ఎల్​.కె.అధ్వాని స్టేట్​మెంట్​ను… వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రికార్డు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

జోషి, ప్రధాన్​ను కూడా

మురళీ మనోహర్ జోషి

బాబ్రీ కేసులో ఎల్​.కె.అధ్వాని తో పాటు నిందితులుగా ఉన్న భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్​ జోషి వాంగ్మూలాన్ని జులై 23న నమోదు చేయనున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జ్ ఎస్​.కె.యాదవ్ తెలిపారు. శివనేన మాజీ ఎంపీ సతీష్ ప్రధాన్​ను జులై 22న వీడియో లింక్ ద్వారా ప్రశ్నించనున్నట్లు స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశం మేరకు… సీఆర్​పీసీ సెక్షన్ 313 కింద బాబ్రీ కేసు విచారిస్తోంది సీబీఐ ప్రత్యేక కోర్టు. ఆగస్టు 31 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *